Google will be come in Amaravati: రాజధాని అమరావతికి ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్ రానుంది. రాష్ట్రప్రభుత్వంతో ఉన్నతస్థాయిలో గూగుల్ ప్రతినిధులు చర్చిస్తున్నారు. ఇందుకుగాను అనంతవరం, నెక్కల్లు మధ్య సమీపంలోని ఈ-8 రోడ్డు పక్కన సర్వేనంబర్లు 10, 12, 13, 15, 16లో సుమారు 143 ఎకరాల భూమి ఉంది. దాన్ని గూగుల్‌కు కేటాయించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. గూగుల్ సంస్థ ప్రారంభించబోయే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు అమరావతిలో అంకురార్పణ చేయనున్నారని తెలిసింది. ఆ సంస్థ ప్రతినిధులు, సీఆర్డీఏ అధికారులతో కలసి శుక్రవారం రోజున నెక్కల్లులో స్థలం పరిశీలించారు. ఇక్కడికి సమీపంలో విమానాశ్రయం, రైల్వేస్టేషన్ కూడా రానుండడంతో సంస్థ ప్రతినిధులు ఈ స్థలం వైపే మొగ్గుచూపినట్లు సమాచారం. గూగుల్ సంస్థను ఇక్కడ నెలకొల్పితే పారిశ్రామికంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం 'హై-రిస్క్' అలర్ట్- వెంటనే ఈ పని చేయకపోతే ఇక అంతే!
'అబ్లో' యాప్ తొలగింపుపై కేంద్రం ఆదేశాలు- క్షణాల్లోనే ప్లే స్టోర్ నుంచి అవుట్!