Warning to Hyderabad residents : ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అందుకు కావాల్సిన అన్ని హంగులు భాగ్యనగరానికి ఉన్నాయి. నిత్యం జన జీవనంతో అన్ని రహదారులు రద్దీగా ఉంటాయి. ఇంత రద్దీతో ఉన్న మహానగరంలో చెత్త కూడా అదేస్థాయిలో పేరుకుపోతుంది. ఆ పేరుకుపోయిన చెత్తను ప్రతిరోజూ పారిశుద్ధ్య కార్మికులు సేకరిస్తూ, దాన్ని రీసైక్లింగ్ ప్రక్రియకు పంపిస్తారు. ఈ క్రమంలో రహదారుల పొడవునా ఏర్పాటు చేసిన చెత్తడబ్బాల్లో ప్లాస్టిక్ కవర్లు ఏర్పాటు చేయాలని, నిండగానే వాటిని తొలగించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి తాజాగా జోనల్ కమిషనర్లు, సర్కిళ్లు ఉప కమిషనర్లను ఆదేశించారు.
పాదాచారులు ఆయా డబ్బాల్లో వేస్తున్న చెత్తను పూర్తిగా తొలగించలేకపోతున్నామని కార్మికులు, ఎప్పటి నుంచో అధికారులకు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. ఈ సమాచారం కమిషనర్‌కు అందడంతో రీసైక్లింగ్‌కు ఉపయోగపడే ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించాలని సిబ్బందికి సూచించారు. చెత్త, నిర్మాణ వ్యర్థాలను రహదారులపై వేస్తున్న వారిని గుర్తించి జరిమానాలు విధించాలని స్పష్టం చేశారు. ఈ నిబంధనలు గతేడాది నుంచే అమల్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు చాలా కఠినంగా వ్యవహరించాలని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది. ఇందుకు గల ముఖ్యకారణం రోడ్లపై చెత్త ఎప్పటికప్పుడు పెరుకుపోతూనే ఉంటుంది.
కొన్ని ప్రాంతాల్లో తడి, పొడి చెత్తను ఒకే డబ్బాలు వేస్తుంటారు. అయితే వాటిని మిషన్‌తో తొలగించడం సాధ్యపడదు. దీంతో కొద్ది చెత్త డబ్బాలో ఉండిపోతుంది. దానివల్ల దోమలు, పురుగులు వస్తుంటాయి. రోగాలకు కారణమవుతుంది. ప్లాస్టిక్ కవర్లు వేయడం వల్ల డబ్బాలోని చెత్తను పూర్తిగా తొలగించవచ్చు. శుభ్రం చేయడానికి సులువుగా ఉంటుంది.
ఫొటో తీసి హెచ్చరిస్తుంది : రోడ్లపై చెత్తే వేసేవారిని గుర్తించేందుకు పోలీసులను కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం నరగ వీధుల్లో సీసీ కెమెరాలతో పాటు మైక్‌లను ఏర్పాటు చేశారు. ఇవి ఎవరైనా చెత్తను వేసినట్లు గుర్తిస్తే హెచ్చరికతో పాటు వారి ఫొటోను తీస్తుంది. దీంతో ప్రజలు చెత్తను రోడ్లపై కాకుండా చెత్త బుట్టల్లో వేసే అవకాశముంటుంది.
రోబోలు అందుబాటులోకి : ఇదిలా ఉండగా రోడ్లపై చెత్తను సేకరించడానికి ఆటోమేటెడ్ ఎలక్ట్రిక్ చెత్త సేకరణ యంత్రాలను జీహెచ్‌ఎంసీ అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది రోడ్లపై చెత్తను శుభ్రం చేస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ చెత్తను తొలగిస్తుంది. అలాగే ఇవి చెత్తను శుభ్రం చేసేటప్పుడు మంచిమాటలను ప్రదర్శిస్తాయి. ప్రస్తుతం వీటిని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారు.
ఇంటి కొలతలు తప్పుగా చూపించి ట్యాక్స్ కడుతున్నారా? - మీకోసం నోటీసులు రెడీ అవుతున్నాయి!