ETV Bharat / state

హుస్సేన్‌సాగర్‌లో గణేశ్​ నిమజ్జనాలకు అనుమతి లేదు - ట్యాంక్​బండ్​పై ఫ్లెక్సీల ఏర్పాటు - NO GANESH IMMERSION AT TANK BUND

Hussain Sagar Ganesh Immersion Issue 2024 : హైదరాబాద్ హుస్సేన్ సాగర్​లో వినాయక నిమజ్జనాలపై పోలీసులు ఆంక్షలు విధించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈసారి హుస్సేన్ సాగర్​లో వినాయక నిమజ్జనాలను అనుమతించడం లేదని ట్యాంక్​బండ్​పై ప్రత్యేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రతి 100 మీటర్లకు ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసి భక్తులు గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అంతే కాకుండా భారీ ఎత్తున ట్యాంక్​బండ్ గ్రిల్స్​కు ఇనుప కంచెలను ఏర్పాటు చేశారు. మరోవైపు ఎన్టీఆర్ మార్గ్, పీవీ మార్గ్ వైపున భారీ క్రేన్లు ఏర్పాటు చేసి నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుండటం గమనార్హం.

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 10, 2024, 12:04 PM IST

Updated : Sep 10, 2024, 3:11 PM IST

NOT ALLOWING GANESHA IMMERSION
Ganesha immersion is not allowed in Hussainsagar (ETV Bharat)

Not Allowing Ganesh Immersion in Hussain Sagar : భాగ్యనగరంలో ఏటా వినాయక నిమజ్జన కోలాహలం అంగరంగ వైభవంగా జరుగుతుంది. నగర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హుస్సేన్ సాగర్​కు శోభయాత్రగా తరలివచ్చి తమ బొజ్జ గణపయ్యను నిమజ్జనం చేస్తారు. అయితే ఈ ఏడాది హుస్సేన్ సాగర్​లో నిమజ్జనాలపై నగర పోలీసులు, జీహెచ్ఎంసీ ఆంక్షలు విధించింది. హైకోర్టు ఆదేశాల మేరకు హుస్సేన్ సాగర్​లో నిమజ్జనాలకు అనుమతి లేదని విజ్ఞప్తి చేస్తూ ట్యాంక్​బండ్ పై ప్రత్యేకంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది.

హుస్సేన్​సాగర్​లో నిమజ్జనాలపై ఆంక్షలు : ట్రాఫిక్ పోలీసు భారికేడ్లతో పాటు ట్యాంక్​బండ్​పై ఉన్న గ్రిల్స్​కు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అలాగే గ్రిల్స్​కు అదనంగా ట్యాంక్​బండ్ పొడవునా భారీ ఇనుప కంచెలను ఏర్పాటు చేసి భక్తులెవరూ సాగర్​లో వినాయక విగ్రహాలు వేయకుండా పకడ్బందీగా బిగించారు. వాటిపై ప్రతి వంద మీటర్లకు ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసి భక్తులెవరూ పీవోపీ విగ్రహాలను సాగర్​లో నిమజ్జనం చేయవద్దని సూచించారు.

భారీ క్రేన్లు ఏర్పాటు : మరోవైపు ఎన్టీఆర్ మార్గ్, పీవీ మార్గ్ వైపున భారీ క్రేన్లను ఏర్పాటు చేసి రెండు రోజుల నుంచి నిమజ్జన ప్రక్రియను కొనసాగిస్తున్నారు. నగరంలోని చాలా ప్రాంతాల నుంచి భక్తులు పీవోపీ, మట్టి విగ్రహాలను తీసుకొచ్చి పీవీ మార్గ్​లోని క్రేన్ల సహాయంతో నిమజ్జనం చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడ జోరుగా నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుంది. ఇదే విషయంపై హైకోర్టు కూడా గతంలో ఆదేశాలు జారీ చేసింది.

హైదరాబాద్‌లో ఈనెల 10 నుంచి గణేశ్‌ నిమజ్జనాలు - ఆ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

హైకోర్టు ఆదేశాలు : జీహెచ్ఎంసీ, హైదరాబాద్ పోలీసు కమిషనర్, హెచ్ఎండీఏలను ఆదేశిస్తూ ట్యాంక్​బండ్​లో పీవోపీ విగ్రహాలు నిమజ్జనం కాకుండా చూడాలని ఆదేశించింది. అయినప్పటికీ ప్రతి ఏటా వేలాదిగా పీవోపీ విగ్రహాలు ట్యాంక్ బండ్​లో నిమజ్జనం జరుగుతూనే ఉంది. గతేడాది దాదాపు 20 వేలకుపైగా పీవోపీ విగ్రహాలను హుస్సేన్ సాగర్​లో నిమజ్జనం చేసినట్లు జీహెచ్ఎంసీ లెక్కలు చెబుతున్నాయి. వాటిని నియంత్రించేందుకు ఈ ఏడాది హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, కాలుష్య నియంత్రణ మండలి దాదాపు 5 లక్షలకు పైగా మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు.

నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు: నిమజ్జనం కోసం కూడా నగరంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆరు జోన్లలో 27 బేబీ పాండ్స్, 24 పోర్టబుల్ పాండ్స్, 20 ఎక్సావేషన్ పాండ్స్​ను ఏర్పాటు చేసింది. సమీపంలో ఉన్న ప్రజలంతా వీటిని వినియోగించుకొని నిమజ్జన ప్రక్రియను సాఫీగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో పోలీసులు, జీహెచ్ఎంసీ ట్యాంక్ బండ్​పై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.

గణపతి బప్పా మోరియా : ఖైరతాబాద్‌ సప్తముఖ మహా గణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు - KHAIRATABAD GANESH 2024

చిరుధాన్యాలతో ఆశీర్వదిస్తున్న విజ్ఞాధిపతి - Ganesha with millets in nampally

Last Updated : Sep 10, 2024, 3:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.