Ganja Lady Don Arrested in Odisha : పలు గంజాయి కేసుల్లో నిందితురాలిగా ఉండి తప్పించుకుని తిరుగుతున్న లేడీ డాన్ సంగీత సాహును ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశా రాష్ట్రం ఖుర్దా జిల్లా కాళీకోట్ గ్రామానికి చెందిన సంగీత సాహు నాలుగు సంవత్సరాల నుంచి గంజాయి దందాలో దిగింది. భువనేశ్వర్‌కు దగ్గరగా ఉండటంతో అనేక రాష్ట్రాల గంజాయి వ్యాపారులతో పరిచయాలు చేసుకుంది. తర్వాత గంజాయి సరఫరా చేయడం మొదలు పెట్టిందని పోలీసులు తెలిపారు. గతంలో ధూల్‌పేట్‌లో 29కిలోలు, 11.3 కిలోల రెండు కేసుల్లో పట్టుబడిన నిందితులకు గంజాయిని సరఫరా చేస్తూ గతంలో పట్టుబడింది.
వాగ్మూలం ప్రకారం కేసు నమోదు : ధూల్‌పేట్‌లో శీలాబాయ్, నేహాబాయ్, ఇషికాసింగ్‌తో పాటు మరికొంత మందికి గంజాయిని సరఫరా చేస్తూ పట్టుబట్టారు. వారిచ్చిన వాంగ్మూలంతో ఆమెపై ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. లేడీ డాన్‌పై మొత్తం నగరంలో అయిదు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సంగీత సాహు ఇన్‌స్టాగ్రామ్‌లో సినీనటి లాగా వీడియోలు పోస్టు చేస్తుంది. గంజాయి వినియోగం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి వ్యాపారులతో ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. ఒడిశా వెళ్లిన ఎస్టీఎఫ్ పోలీసులు అక్కడి పోలీసుల సహకారంతో లేడిడాన్ సంగీతను అరెస్ట్ చేసి నగరానికి తీసుకువచ్చారు. సంగీతను పట్టుకున్న పోలీసులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వి.బి. కమలాసర్‌రెడ్డి అభినందించారు.
మరోవైపు రూ.కోటి విలువగల గంజాయి పట్టివేత : అనుమానం రాకుండా కంటెయినర్‌లో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని రాచకొండ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి కోటి రూపాయలకు పైగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర పూనెకు చెందిన అహ్మద్ గులాబ్ షేక్ విశాఖపట్నం అరకు నుంచి గంజాయి కంటెయినర్‌లో 300 కిలోల గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్వోటీ, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులతో కలిసి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి షేక్‌ను పట్టుకున్నారు.
ఆర్థిక సమస్యలతో రూట్ ఛేంజ్ : డ్రైవర్‌గా పనిచేస్తున్న గులాబ్ షేక్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా గంజాయి రవాణను వృత్తిగా ఎంచుకున్నాడు. పూనెకు చెందిన వైభవ్, దేవతో గులాబ్ గంజాయి రవాణ ఒప్పందం కుదుర్చుకుని, రవాణ చేస్తున్నట్టు రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. గంజాయి రవాణ వ్యవహారం బయట పడకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి రవాణ చేసే సమయంలో తన వెంట గులాబ్ ఎవరూ ఉండకుండా చూసుకునేవాడని దర్యాప్తులో బయటపడింది. గతంలో కూడా పలు మార్లు నిందితుడు గంజాయి రవాణ చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ మేరకు నిందితుడి వద్ద నుంచి గంజాయితో పాటు డీసీఎం వ్యాన్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
గంజాయితో ఐస్‌క్రీమ్, చాక్లెట్ బాల్స్ - హోలీ వేడుకల్లో గుట్టురట్టు
చెత్త సామాన్ల మధ్యలో కోటి రూపాయల గంజాయి
ఇన్‌స్పెక్టర్‌కు రూ.లక్షన్నర.. ఎస్‌ఐలకు రూ.50 వేలు - గంజాయి డాన్ కేసులో బయటకొస్తున్న నిజాలు