ETV Bharat / state

మెద‌డులో క్యాన్స‌ర్‌, క‌ణితులు ఉన్నాయా? - కిమ్స్​లో గామానైఫ్ టెక్నాల‌జీతో కోత లేని చికిత్స - GAMMA KNIFE CENTER IN KIMS

కిమ్స్ ఆస్ప‌త్రిలో గామా నైఫ్ టెక్నాల‌జీ - శస్త్రచికిత్స‌ల‌తో పోలిస్తే మ‌రింత సుర‌క్షితంగా, వేగంగా, క‌చ్చిత‌మైన చికిత్స‌ - ప్రారంభించిన ఆసుపత్రి సీఎండీ బొల్లినేని భాస్క‌ర‌రావు

Gamma Knife Center Opened in KIMS
Gamma Knife Center Opened in KIMS (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 15, 2025 at 8:25 PM IST

4 Min Read

Gamma Knife Center Opened in KIMS : మెద‌డు సంబంధిత స‌మ‌స్య‌ల‌కు శ‌స్త్రచికిత్స‌ల కంటే సుర‌క్షిత‌మైన, ప్ర‌పంచంలోనే అత్యాధునిక‌మైన గామానైఫ్ టెక్నాల‌జీని హైద‌రాబాద్ వాసుల‌కు కిమ్స్ ఆస్ప‌త్రి అందుబాటులోకి తీసుకొచ్చింది. సంక్లిష్ట‌మైన మెద‌డు స‌మ‌స్య‌ల‌కు చికిత్స చేసే విధానాన్ని ఇది స‌మూలంగా మార్చనుంది. దీనివ‌ల్ల రోగుల‌కు సంప్ర‌దాయ శ‌స్త్రచికిత్స‌ల‌తో పోలిస్తే మ‌రింత సుర‌క్షితంగా, వేగంగా, క‌చ్చిత‌మైన చికిత్స‌లు అందుతాయి.

చికిత్స జరిగిన రోజే ఇంటికి : మెద‌డులో క్యాన్స‌ర్‌, ఇత‌ర క‌ణితులు ఏర్ప‌డిన‌ప్పుడు వాటిని తొల‌గించేందుకు శ‌స్త్రచికిత్స‌ల‌కు బ‌దులుగా గామానైఫ్ రేడియో స‌ర్జ‌రీ అనేది ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌సిద్ధి చెందిన విధానం. మిల్లీమీట‌ర్లు, అంత‌కంటే త‌క్కువ ప్ర‌దేశాన్ని కూడా గుర్తించి, మెద‌డులోప‌ల ఉన్న భాగాల‌కు చికిత్స చేసేందుకు రేడియేష‌న్ కిర‌ణాల‌ను ఇందులో పంపుతారు. ఇందులో అస‌లు ర‌క్తం కార‌దు, నొప్పి ఉండ‌దు. చాలావ‌ర‌కు రోగులు అదేరోజు ఇంటికి వెళ్లిపోతారు. మెద‌డులో వ‌చ్చే క‌ణితులు (క్యాన్స‌ర్, ఇత‌రాలు), ర‌క్త‌నాళాలు స‌రిగా ఏర్ప‌డ‌క‌పోవ‌డం, పిట్యుట‌రీ క‌ణితులు, విప‌రీత‌మైన నొప్పి త‌దిత‌రాల‌కు ఇది స‌రైన చికిత్స‌. వ‌య‌సు, ఆరోగ్యం కార‌ణంగాను, క‌ణితి ఉన్న ప్ర‌దేశం వ‌ల్ల శ‌స్త్రచికిత్స చేయ‌లేనివారికి ఇది మ‌రింత ప్ర‌యోజ‌న‌క‌రం.

Gamma Knife Center Opened in KIMS
కిమ్స్​లో అందుబాటులోకి గామానైఫ్ టెక్నాల‌జీ (ETV Bharat)

గామా నైఫ్ సెంట‌ర్ ఆవిష్క‌ర‌ణ సంద‌ర్భంగా కిమ్స్ ఆస్ప‌త్రికి చెందిన సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ న్యూరోస‌ర్జ‌న్ డాక్ట‌ర్ మాన‌స్ పాణిగ్రాహి మాట్లాడుతూ, “న్యూరో ఆంకాల‌జీ, న్యూరోస‌ర్జ‌రీ కేసుల్లో గామా నైఫ్ గ‌ణ‌నీయ‌మైన మార్పు తెచ్చింది. సంక్లిష్ట‌మైన‌, సున్నిత‌మైన మెద‌డు స‌మ‌స్య‌ల‌ను అత్యంత క‌చ్చిత‌త్వంతో, రోగికి ఎలాంటి స‌మ‌స్య లేకుండా దీంతో న‌యం చేయ‌గ‌లం. ద‌క్షిణ భార‌తం, చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లోని రోగుల‌కు ఇది ఒక గేమ్ ఛేంజ‌ర్ అవుతుంది” అని అన్నారు.

“ద‌క్షిణ భార‌త‌దేశంలోనే అత్యాధునికమైన గామానైఫ్ సెంట‌ర్ కిమ్స్ ఆస్ప‌త్రిలో తీసుకొచ్చినందుకు ఎంతో గ‌ర్విస్తున్నాం. ఇది మెద‌డు చికిత్స‌ల్లో కొత్త విప్ల‌వం. అత్యంత కచ్చిత‌త్వం, రోగుల‌కు ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉండే ఈ అంత‌ర్జాతీయ స్థాయి టెక్నాల‌జీని తీసుకురావ‌డం మా నిబ‌ద్ధ‌త‌కు నిద‌ర్శ‌నం. శ‌స్త్రచికిత్స అవ‌స‌రాన్ని దాదాపుగా త‌ప్పించేలా ఈ సుర‌క్షిత‌మైన‌, వేగంగా కోలుకునే ప‌ద్ధ‌తిని రోగుల‌కు అందిస్తున్నాం. అత్యాధునిక వైద్యచికిత్స‌ల‌కు కేంద్రంగా హైద‌రాబాద్ స్థానాన్ని ఈ సెంట‌ర్ మ‌రింత బ‌లోపేతం చేస్తుంది” - డాక్ట‌ర్ బొల్లినేని భాస్క‌ర‌రావు, కిమ్స్ ఆస్ప‌త్రి సీఎండీ

జీవన నాణ్యత పెంచేలా : శ‌రీరంలో వేరే ఏదైనా భాగంలో క్యాన్స‌ర్ వ‌చ్చి, ఆ త‌ర్వాత మెద‌డుకు వ్యాపించిన‌ప్పుడు (మెటాస్టాసిస్‌) అలాంటివారికి చికిత్స చేయ‌డానికి గామానైఫ్ అత్య‌ద్భుతంగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ అత్యాధునిక టెక్నాల‌జీతో వైద్యులు ఒకేసారి అనేక క‌ణితుల‌ను క‌రిగించ‌గ‌ల‌రు. అందువ‌ల్ల ఆస్ప‌త్రిలో చేరాల్సిన అవ‌స‌రం, శ‌స్త్రచికిత్స అవ‌స‌రం రెండూ ఉండ‌వు. సంప్ర‌దాయ రేడియేష‌న్ చికిత్స‌ల్లా కాకుండా, గామానైఫ్ కేవ‌లం క‌ణితినే ల‌క్ష్యం చేసుకుంటుంది. ఆరోగ్య‌క‌రమైన క‌ణ‌జాలాల‌ను ర‌క్షిస్తుంది. జ్ఞాప‌క‌శ‌క్తి పోవ‌డం లాంటి దుష్ప్ర‌భావాలు ఇందులో ఉండ‌వు. ఇది త్వర‌గా అయిపోతుంది, నొప్పి ఉండ‌దు, అదే రోజు ఇంటికి వెళ్లిపోవ‌చ్చు. చాలామంది క్యాన్స‌ర్ రోగుల‌కు మెరుగైన జీవ‌న నాణ్య‌త అందించేలా ఇది ఒక ఆశాదీపంలా ఉంది.

మెద‌డులో వ‌చ్చే స‌మ‌స్య‌ల్లో ప్ర‌ధానంగా క్యాన్స‌ర్ మెటాస్టాటిస్ క‌ణితుల‌ను శ‌స్త్రచికిత్స‌తో తొలగించ‌డం క‌ష్టం అవుతుంది. అలాంట‌ప్పుడు గామానైఫ్ చికిత్స చాలా ప్ర‌యోజ‌న‌క‌రం. ఇందులో రేడియేష‌న్ కిర‌ణాల‌ను కేంద్రీక‌రించి పంపుతారు. మొత్తం 192 గామా కిర‌ణాల‌ను మెద‌డులో ఒకేచోటుకు పంపుతారు. దీనివ‌ల్ల ప్ర‌భావిత ప్రాంతం మీద అధిక‌మోతాదులో రేడియేష‌న్ అందుతుంది. చుట్టుప‌క్క‌ల క‌ణ‌జాలాల‌కు ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు. అత్యంత క‌చ్చితత్వం కోసం ఎంఆర్ఐ లేదా సీటీస్కాన్ లాంటివాటి సాయంతో ఈ చికిత్స చేస్తారు.

విజయాల రేటు ఎక్కువ : చికిత్స‌కు ముందు రోగి త‌ల క‌ద‌ల‌కుండా ఉండేందుకు ఒక ఫ్రేమ్ పెడ‌తారు. గామా కిర‌ణాలు స‌రిగ్గా ఎక్క‌డ ప‌డాలో చూస్తారు. ఏమాత్రం నొప్పి లేకుండా, కొన్ని గంటల్లోనే అయిపోయే ఈ చికిత్స స‌మ‌యంలో రోగి మెల‌కువగానే ఉంటారు. ఇందులో కోత ఉండ‌దు, అందుకే ర‌క్తం పోదు, ఇన్ఫెక్ష‌న్లు రావు, జ‌న‌ర‌ల్ ఎన‌స్థీషియా ఇవ్వ‌క్క‌ర్లేదు. మెద‌డులో వ‌చ్చే క‌ణితులు (క్యాన్స‌ర్, ఇత‌రాలు), ర‌క్త‌నాళాలు స‌రిగా ఏర్ప‌డ‌క‌పోవ‌డం, పిట్యుట‌రీ క‌ణితులు, విప‌రీత‌మైన నొప్పి త‌దిత‌రాల‌కు ఇది బాగా స‌మ‌ర్థ‌వంతంగా ఉప‌యోగ‌ప‌డుతుంది. చాలామంది రోగులు అదేరోజు ఇంటికి వెళ్లి, ప‌నులు చేసుకోవ‌చ్చు. ఇది ఒకేసారి చేసే చికిత్స‌. దుష్ప్ర‌భావాలు చాలా త‌క్కువ‌, విజ‌యాల రేటు ఎక్కువ‌.

ఇప్ప‌టివ‌ర‌కు గామా నైఫ్ చికిత్స‌లు ప్ర‌పంచంలో 10 ల‌క్ష‌ల మందికి పైగా రోగులు పొందారు. మ‌న దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు 8వేల ప్రొసీజ‌ర్లు చేశారు. కొన్నిర‌కాల మెద‌డు క‌ణితుల‌కు, న్యూరాల్జియా లాంటి స‌మ‌స్య‌ల‌కు ఇది 90% విజ‌యాలు అందిస్తుంది. ఇందులో మిల్లీమీట‌ర్ల స్థాయి క‌చ్చిత‌త్వంతో రేడియేష‌న్ అందిస్తారు. దీనికి స‌గ‌టున 30 నిమిషాల నుంచి 2 గంట‌ల వ‌ర‌కు ప‌డుతుంది. ఆస్ప‌త్రిలో చేరాల్సిన అవ‌స‌రం లేదు. చికిత్స అనంత‌రం 24-48 గంట‌ల్లోనే 90% రోగులు త‌మ ప‌నులు చేసుకుంటారు. వైట్ బ్రెయిన్ మెటాస్టాటిస్ క‌ణితులు, ర‌క్త‌నాళాల్లో స‌మ‌స్య‌లు లాంటి 20 ర‌కాల స‌మ‌స్య‌ల‌కు ఇది స‌మర్థ‌వంత‌మైన ప‌రిష్కారం. కిమ్స్ ఆస్ప‌త్రిలో పెట్టిన‌ది ఒకే సెష‌న్‌లో ప‌లు క‌ణితుల‌ను కూడా న‌యం చేస్తుంది. దాంతో చికిత్స స‌మ‌యం త‌గ్గుతుంది. న్యూరాల్జియా స‌మ‌స్య‌కు దీంతో చికిత్స చేస్తే 48 గంట‌ల్లోనే నొప్పి బాగా త‌గ్గుతుంది. మొత్తం రోగుల్లో 2% మందికి మాత్ర‌మే కొన్ని ప్ర‌భావాలు క‌నిపిస్తాయి. సంప్ర‌దాయ మెద‌డు శ‌స్త్రచికిత్స‌ల కంటే ఇందులో దుష్ప్ర‌భావాలు దాదాపు లేన‌ట్లే.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.