4 YEAR OLD BOY DIED IN DOG ATTACK: వీధికుక్క దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా స్వర్ణభారతి నగర్‌లో జరిగింది. బాలుడి మెడను కుక్క కొరికేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు.
విచారం వ్యక్తం చేసిన మంత్రి నారాయణ: గుంటూరు స్వర్ణ భారతి నగర్‌లో కుక్క కాటుతో నాలుగేళ్ల బాలుడు మృతిపై మంత్రులు నారాయణ, దుర్గేష్‌లు విచారం వ్యక్తం చేశారు. ఘటనకు గల కారణాలపై జిల్లా ఇంఛార్జి కలెక్టర్ భార్గవ తేజ, జీఎంసీ కమిషనర్‌తో ఫోన్లో మాట్లాడారు. మంత్రి ఆదేశాలతో గుంటూరు జీజీహెచ్‌లో చిన్నారి గోపీ తల్లిదండ్రులను కమిషనర్ శ్రీనివాసులు పరామర్శించారు. ప్రభుత్వం తరపున కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
కుక్కల నుంచి తప్పించుకోపోయి బావిలో పడ్డ యువకుడు- 3 రోజులపాటు తాడు పట్టుకుని అందులోనే- చివరకు!
ఎన్నడూ లేనంతగా కుక్కల దాడులు - ఒక్క జిల్లాలోనే 6800 మంది బాధితులు