Venkaiah Naidu About Jamili Elections: జమిలి ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలకు ఇబ్బంది అనేది కేవలం అపోహ మాత్రమే అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. తిరుపతిలో ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ అంశంపై నిర్వహించిన మేధావుల సదస్సులో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. సాంకేతికత సాయంతో జమిలి ఎన్నికలు జరపడం కష్టం కాదని అభిప్రాయపడ్డారు. జమిలి ఎన్నికలతో ఖర్చు ఆదా అవుతుందని చెప్పారు.
జమిలి ఎన్నికలను కొన్ని పార్టీలు వ్యతిరేకించడంలో రాజకీయ కోణం తప్ప మరేమీ లేదని పేర్కొన్నారు. అధికారం పోతే కొన్ని పార్టీలు తట్టుకోలేకపోతున్నాయని, సంయమనం కోల్పోతున్నాయని వెంకయ్యనాయుడు అన్నారు. పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్యానికి చేటు అని వెంకయ్య పేర్కొన్నారు. పార్టీ మారే నేతలు పదవికి రాజీనామా చేయాలనే నిబంధన రావాలని సూచించారు.
ఓట్ల కోసం అన్నీ ఫ్రీ ఫ్రీ - చివరికి జీతాలు చెల్లించలేని పరిస్థితి : వెంకయ్య నాయుడు
సనాతన ధర్మాన్ని పాటించాల్సిన బాధ్యత అందరిది : వెంకయ్య నాయుడు