Foods to Eat to Prevent Dehydration in Summer : రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. వేడిమి కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. దీని ద్వారా అనారోగ్యాల బారిన పడే అవకాశాలుంటాయి. దీన్ని నివారించేందుకు నిత్యం సరిపడా నీరు తాగడంతో పాటు వేసవిలో లభించే నీటి శాతం అధికంగా ఉండే పండ్లను తరచూ తినాలి. ఇలా చేస్తే శరీరం చల్లబడడంతో పాటు ఇతర పోషకాలు సైతం అందుతాయని న్యూట్రీషనిస్టులు చెబుతున్నారు.
- వేసవిలో కర్బూజను తరచూ తీసుకోవడంతో శరీరం చల్లబడంతో పాటు తక్షణ శక్తి వస్తుంది. మలబద్దకం, జీర్ణ సంబంధ సమస్యలు సైతం దూరమవుతాయి. రోగ నిరోధక శక్తిని పెంచి ఒత్తిడిని సైతం తగ్గిస్తుంది.
- ఈ కాలంలో తప్పకుండా తినాల్సిన అసలైన పండు పుచ్చకాయ. దీనిలో నీటి శాతం అధికంగా ఉంటుంది. అది వడదెబ్బ నుంచి రక్షిస్తుంది. మూత్రంలో మంటను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయ పడుతుంది.
- పండ్లలో రాజు మామిడి వేసవిలోనే దొరుకుతుంది. దీన్ని తరచూ తీసుకోవడంతో జీర్ణక్రియ మెరుగుపడడంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
- వీటితో పాటు నారింజ, ద్రాక్ష, అరటిపండ్లు, కివీ, తాటి ముంజలు వంటి పండ్లను తరచూ తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి.
వివిధ పండ్లలో ఉండే నీటి శాతం, పోషకాల వివరాలు | ||
పండు | నీటి శాతం | పోషకాలు |
కర్బూజ | 90 | ఐరన్, మెగ్నిషియం, డైటరీ, విటమిన్-సీ, బీ6 |
పుచ్చకాయ | 95 | లైకోపీన్, విటమిన్-ఏ, సీ, బీ, యాంటీ ఆక్సిడెంట్లు, ఆమైనో యాసిడ్లు |
మామిడి పండు | 82 | ప్రోటిన్లు, విటమిన్-ఏ, సీ, బీ6, మెగ్నీషియం, ఐరన్, రైబోప్లేవిన్ |
తాటిముంజలు | 90 | కార్బొహైడ్రేట్లు, కాల్షియం, న్యూట్రీయెంట్లు |
దోస | 96 | విటమిన్-ఏ, సీ, కే, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం |
నారింజ | 80 | విటమిన్-సీ, బీ2, కాల్షియం, ఐరన్, పొటాషియం |
వేసవిలో కళ్ల ఆరోగ్య విషయంలో జాగ్రత్త - నేత్ర సంరక్షణకు వైద్యుల సూచనలు ఇవే!
తల్లిదండ్రులు ఇటువైపు లుక్కేయండి - వేసవిలో మీ పిల్లలు ఏం చేస్తున్నారో ఇలా తెలుసుకోండి