Foods to Eat and Avoid To Stay Cool in Summer : ప్రస్తుత వేసవిలో ఆహార అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని కామారెడ్డికి చెందిన జనరల్ ఫిజిషియన్ డాక్టర్ పవన్‌కుమార్ పేర్కొన్నారు. ఏదైనా అతిగా తీసుకోవద్దని, మరీ ముఖ్యంగా మాంసాహారాన్ని పరిమిత స్థాయిలో తీసుకోవడం మంచిదన్నారు. నిత్యం వ్యాయామం చేయడంతో పాటు ఆహార నియమాలు పాటిస్తే మరింత ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు. ఆరోగ్య నియమాలు పాటించడం అలావాటు చేసుకోవాలని సూచించారు.
- ఉదయం నూనె వంటలు కాకుండా ఆవిరితో చేసిన వంటకాలు తినాలి. ఇడ్లీలు, కుడుములు వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి.
- భోజనంలో ఎక్కువగా ఆకు కూరలు ఉండేలా చూడాలి. నిత్యం ఒక రకమైన ఆకుకూరలు కాకుండా రోజూ వివిధ రకాలు భాగం చేసుకోవాలి.
- ఆహార పదార్థాల్లో నూనె తగ్గించుకోవాలి. వేపుళ్లకు దూరంగా ఉండడం మంచిది.
- వేసవిలో ఎక్కువగా పచ్చళ్లు పెడుతుంటారు. వీటని కూడా పరిమితంగానే తీసుకోవాలి.
- అన్ని పండ్లతో పాటు ఈ కాలంలో లభించే మామిడి పండ్లను తింటే ఏ, డీ విటమిన్లు శరీరానికి అందుతాయి.
- పుచ్చకాయ, కర్బుజా వంటి పంట్లను ఎక్కువగా తినాలి.
- కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండడం మంచిది. వాటికి బదులు కొబ్బరి నీళ్లు తాగడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. కాఫీ, టీలకు కూడా సాధ్యమైనంత దూరంగా ఉండాలి.
- పిల్లలకు మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, గ్లూకోజ్ నీరు, ఎండు ఖర్జూరం వంటివి ఇవ్వాలి. సగ్గుబియ్యం కాచిన నీటిలో ఒక చెంచా పంచదార, చిటికెడు ఉప్పు కలిపి ఇస్తే మంచిది.
త్వరగా అలసిపోతున్నారా? ఇవి తింటే ఫుల్ ఎనర్జీతో ఉంటారట! అవేంటో తెలుసా?