ETV Bharat / state

గోదావరిలో పడవ పోటీలు - పందెం గెలిస్తేనే మనుగడ!

గోదావరి నదీపాయల్లో బలుసుతిప్పలో పడవల పోటీలు - దాదాపు 40 పడవుల్లో పోటీ పడిన మత్స్యకారులు - ఎందుకంటే ?

BOAT RACING FOR FISH HUNT PLACE
Boat Racing for Fish hunt Place in Ambedkar Konaseema (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 4, 2024, 9:28 PM IST

Boat Racing for Fish hunt Place in Ambedkar Konaseema : ఏంటి ఒకరికొకరు పోటీ పడి మరి పడవ నడుపుతున్నారు. ఇప్పుడేం పోటీలు ఉన్నాయి అని అనుకుంటున్నారా ? అవును నిజమే. కానీ సరదా కోసం కాదు, వారు ఉపాధి కోసం ఈ పోటీలు. పడవ పోటీలకు వారి ఉపాధికి సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా ? ఇది తెలియాలి అంటే ఈ స్టోరీ తెలుసుకోవాల్సిందే. ఏపీలో గోదావరి నదీపాయల్లో మత్స్య సంపదను వేటాడాలంటే మత్స్యకారులు కొన్ని హద్దులను ఏర్పాటు చేసుకుంటారు. నిర్దేశించిన ప్రాంతంలో చేపల వేట సాగించాలంటే ఎవరైనా సరే ఈ పోటీలో పాల్గొని గెలవాల్సిందే.

గోదావరి నదీపాయల్లో బలుసుతిప్పలో పడవల పోటీలు (ETV Bharat)

ఈ నేపథ్యంలో పడవల పోటీలను నిర్వహిస్తారు. ముందుగా వారు ఏ ప్రాంతానికి చేరుకుంటే అక్కడి వరకు వేటసాగించేందుకు అర్హలు అవుతారు. అంతకమించి పై ప్రాంతంలో వేట సాగిచకుండా నిషేధం విధిస్తారు. ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఈ పడవ పోటీలను నిర్వహించారు. ముమ్మిడివరం నియోజవర్గంలోని వృద్ధ గౌతమి, గౌతమీ గోదావరి, గోదావరి పాయలు ప్రవహిస్తాయి. వీటిలో మత్స్య సంపదను వేటాడేందుకు బలుసుతిప్పలో పడవల పోటీలను ఏర్పాటు చేశారు. దాదాపు 40 పడవుల్లో తమ వేట స్థలాల కోసం మత్స్యకారులు పోటీ పడ్డారు. పిల్లంక, యానం, పోలవరం, మసకపల్లి, కుండలేశ్వరం తదితర ప్రాంతాలోని గోదావరిలో ఈ పోటీ జరిగింది.

పోలీసుల సమక్షంలో పోటీలకు హద్దులు : ఒక్కొక్క పడవపై నాలుగు కుటుంబాలకు చెందిన వారు ఉండగా ముందుగా వారు ఏ ప్రాంతానికి చేరుకుంటారో అక్కడి వరకు వేటసాగించేందుకు అర్హులు అవుతారు. అంతమించిపై ప్రాంతంలో వేట సాగించకుండా నిషేధం కూడా విధించారు. గతంలో పడవల పోటీల విషయంలో మత్య్సకారుల మధ్య గొడవలు జరిగి గ్రామాల్లో దాడులు సైతం జరిగిన ఘటనలు ఉన్నాయి. 2014లో టీటీపీ ప్రభుత్వం గ్రామ కమిటీలు వేసి పోలీసుల సమక్షంలో ఎటువంటి గొడవలు కాకుండా పోటీలను నిర్వహించి హద్దులను కేటాయించింది. ఈ పద్ధతి అందరికీ నచ్చడంతో ఇప్పటికీ ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ పోటీలను చూసేందుకు అక్కడున్న స్థానికులు సైతం ఆస్తకి చూపారు.

దాల్​ సరస్సులో జోర్దార్​గా పడవల రేస్​

గడ్డకట్టిన సరస్సుపై 'డ్రాగన్'​ వేగంతో దుసుకెళ్లిన బోట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.