Fire Accident In Jagtial District : జగిత్యాల అర్బన్ మండలం ధరూర్‌లో కరీంనగర్ ప్రధాన రహదారి పక్కన భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్క్రాప్ దుకాణంలో మంటలు అంటుకుని భారీగా ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. స్క్రాప్ దుకాణం పక్కనే ఉన్న శ్మశానవాటికలో ఓ వృద్ధురాలి శవాన్ని దహనం చేస్తుండగా గాలి వేగానికి అగ్నికీలలు స్క్రాప్ దుకాణంపై పడటంతో మంటలు అంటుకున్నాయి.
చెత్త, ప్లాస్టిక్, పాత సామాను ఉండడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది గంటన్నరకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. స్క్రాప్ దుకాణం పక్కనే ఇల్లు, ఓ పెట్రోల్ బంక్ కూడా సమీపంలోనే ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది రెండు వాహనాలతో మంటలను అదుపులోకి తీసుకురావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో సుమారు రూ.5 లక్షల పైగా నష్టం వాటిలినట్లు తెలుస్తోంది.
ఆ గంట జాప్యమే వారి ప్రాణాలు తీసిందా? - గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదంలో కీలక విషయాలు
ఆగి ఉన్న ఎలక్ట్రిక్ బైక్‌లో చెలరేగిన మంటలు - పక్కనే ఉన్న మరో వాహనానికీ!