ETV Bharat / state

కరెంట్ ​షాక్​తో తండ్రి, కుమారుల మృతి - తల్లికి గాయాలు - FATHER AND SON DIE OF ELECTROCUTION

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి - కరెంట్​ షాక్​తో తండ్రి ఏనుగు నర్సయ్య(55), కుమారుడు ప్రవీణ్(30) మృతి, తల్లికి గాయాలు - ఇద్దరి మృతితో గ్రామంలో విషాద ఛాయలు

Father And Son Die Of Electrocution
Father And Son Die Of Electrocution (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : June 25, 2025 at 1:12 PM IST

1 Min Read

Father And Son Die With Current Shock : విద్యుదాఘాతంతో తండ్రి, కుమారుడు మృతిచెందిన విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

వివరాల్లోకి వెళితే : ఇల్లందు మండలం మర్రిగూడెం పంచాయతీ ఎల్లాపురం గ్రామానికి చెందిన ఎర్రమ్మ తెల్లవారుజామున కాలకృత్యాలు తీర్చుకునే క్రమంలో దుస్తులు వేసుకునే దండం పట్టుకుంది. కానీ అప్పటికే ఆ తీగకు ఎలక్ట్రికల్​ సర్వీస్​ వైర్​ తాకి విద్యుత్​ ప్రవహిస్తోంది. ఈ క్రమంలోనే ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన భర్త ఏనుగు నర్సయ్య(55), కుమారుడు ప్రవీణ్(30) కరెంట్​ షాక్​ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ఘటనలో నర్సయ్య భార్య ఎర్రమ్మ తీవ్రంగా గాయపడింది. ఆమెను ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యచికిత్స కోసం ఖమ్మం తరలించారు. వ్యవసాయమే వీరి కుటుంబానికి జీవనాధారం. ప్రవీణ్​కు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై సమాచారమందుకున్న కొమరారం ఎస్సై నాగుల్ మీరా ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.

గణపతి విగ్రహాలు తరలిస్తుండగా విద్యుదాఘాతం - ఇద్దరి మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు

వర్షాకాలంలో కరెంట్‌తో జర భద్రం - షాక్ తగలకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.