Farmers Protest At Tahsildar Office in Parvatipuram: పార్వతీపురం తహశీల్దార్ కార్యాలయం వద్ద రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. భూ సమస్యల పట్ల రెవెన్యూ అధికారుల తీరుని నిరసిస్తూ సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదులను అందజేశారు. డిజిటల్ సంతకం కోసం రెండు నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నప్పటికీ తహశీల్దార్ స్పందించడం లేదని రైతులు ఆరోపించారు.
పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం తహశీల్దార్ తీరుపై రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజులు క్రితమే పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర తనను ఫోన్లో దూషించారంటూ స్థానిక తహశీల్దార్ జయలక్ష్మి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో భూ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు కార్యాలయానికి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దాంతో సబ్ కలెక్టర్ శ్రీ వాత్సవ్ రైతులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని సర్ది చెప్పారు.
తహశీల్దార్ కార్యాలయం వద్ద రైతుల నిరసన: మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు కార్యాలయం వద్ద నినాదాలు చేశారు. భూ సమస్యలపై రెవెన్యూ అధికారుల తీరుపై సబ్ కలెక్టర్ శ్రీవాత్సవకు ఫిర్యాదు చేశారు. డిజిటల్ సంతకం కోసం రెండు నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా తహశీల్దార్ స్పందించడం లేదని సబ్ కలెక్టర్ వద్ద పలు గ్రామాల రైతులు వాపోయారు.
రైతులతో మాట్లాడిన సబ్ కలెక్టర్: పార్వతీపురం మండలం ములగ గ్రామ రైతులు తమ భూ సమస్యలపై ఆందోళన చేపట్టారు. పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర ఫోన్లో తనను దూషించారంటూ తహశీల్దార్ జయలక్ష్మి శుక్రవారం లేఖ ద్వారా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తహశీల్దార్ జయలక్ష్మి ఎమ్మెల్యే పై ఫిర్యాదు నేపథ్యంలో భూ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు కార్యాలయానికి ప్రత్యర్థులు రైతులను తరలించారనే విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ శ్రీ వాత్సవ్ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు.
చర్యలు తీసుకుంటామన్నామని వెల్లడి: తహశీల్దార్ కార్యాలయ అధికారులు సిబ్బంది తీరుపై సబ్ కలెక్టర్‌కు రైతులు ఫిర్యాదులు చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ పార్వతీపురం మండల తహశీల్దార్ కార్యాలయంపై పలు ఆరోపణలు వచ్చాయని వాటిపై శాఖాపరమైన విచారణ జరిపిస్తామని తెలిపారు. ములగ గ్రామానికి చెందిన భూములు విషయంలో కొంతమంది రైతులు తహశీల్దార్‌కు నగదు ఇచ్చినట్లు వచ్చిన ఆరోపణలపై కూడా దర్యాప్తు చేయిస్తామని ఆయన అన్నారు. పాలనాపరమైన లోపాలు ఉంటే వాటిని సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామన్నామని పేర్కొన్నారు.
''అధికారులపై వచ్చిన ఫిర్యాదులపై శాఖాపరమైన విచారణ జరిపిస్తాం. ప్రస్తుతం రైతులు అధికారులపై చేస్తున్నవి కేవలం ఆరోపణలు మాత్రమే. దీనిపై నిజానిజాలు ఏమిటో తెలిసిన తర్వాతే దీనిపై ఏ నిర్ణయానికొస్తాం. అనంతరం పాలనాపరమైన లోపాలు ఉంటే వాటిని సరిదిద్దేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటాం''-శ్రీవాస్తవ్, సబ్ కలెక్టర్,
పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దు: మంత్రి పార్థసారథి
అసలు, వడ్డీ చెల్లించాల్సిందే - రైతులను ఏడిపిస్తున్న బ్యాంకర్లు