ETV Bharat / state

ఆధార్​ కార్డు తరహాలోనే రైతులకు ఐడీ కార్డులు - పీఎం కిసాన్​ లబ్ధిదారులకు ఈ కార్డు మస్ట్!

రైతుల సమగ్ర సమాచారం డిజిటలైజ్​ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు - ఆధార్​ కార్డుల తరహాలో రైతులకు ఐడీ కార్డులు ఇవ్వనున్న సర్కారు - పీఎం కిసాన్‌ లబ్ధిదారులకు తప్పనిసరి

Farmer Unique ID Card Advantages
Farmer Unique ID Card Advantages (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 25, 2025 at 7:37 PM IST

2 Min Read
Choose ETV Bharat

Farmer Unique ID Card Advantages : వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్‌ చేయాలనే సంకల్పంతో రైతన్నలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు ప్రతి అన్నదాతకు ఆధార్‌ మాదిరి ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ పేరుతో 11 అంకెల సంఖ్యతో గుర్తింపు కార్డులను(ఐడీ కార్డులు) జారీచేయనున్నారు.

ఆధార్‌తో అనుసంధానం : ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ నంబరును ఆధార్‌ కార్డుతో అనుసంధానం(లింక్) చేయనున్నారు. రైతుకు సంబంధించిన ఈ 11 అంకెల సంఖ్యను ఎంటర్ చేస్తే చాలు రైతు పేరు, ఇతర వివరాలు అన్ని అందుబాటులో ఉంటాయి. రైతు స్వగ్రామం, ఏ ఏ సర్వే నంబర్లలో ఎంత భూమి ఉంది, ఆ భూమి సారవంతమైనదేనా? ఆ నేలలో ఏ ఏ పంటలు పండించవచ్చు? రైతులకు ఎంత మేర అప్పు ఉన్నదో తెలుసుకోవచ్చు? పీఎం సమ్మాన్‌ నిధి, రసాయన ఎరువులు, పంట పరిహారం వివరాలను అందులో ఎంటర్ చేస్తారు.

ఇవీ ప్రయోజనాలు : బ్యాంకు లోన్​ల కోసం అధికారులకు పట్టా పాసు పుస్తకం ఇతర డాక్యుమెంట్లను చూపించాల్సిన అవసరం ఉండదు. రైతుకు జారీచేసినటువంటి గుర్తింపు కార్డును సదరు అధికారికి చెబితే సరిపోతుంది. ఇందు కోసం ఏప్రిల్‌ 15న జిల్లా నుంచి ఇద్దరు చొప్పున హైదరాబాద్‌లో శిక్షణ ఇచ్చారు. వారు డివిజన్‌ వారిగా ఏవో(అగ్రికల్చర్​ ఆఫీసర్), ఏఈవోలకు ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ గురించి అవగాహన కల్పించారు. ఏప్రిల్ 22వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రారంభించాల్సి ఉండగా ఉన్నతాధికారుల ఆదేశాలతో అధికారులు వాయిదా వేశారు.

"ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ ఏప్రిల్ 22వ తేదీ నుంచి ప్రారంభించాల్సి ఉండగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాయిదా పడింది. రైతులు ఆధార్‌కార్డు, పట్టాదారుపాసు పుస్తకాల జిరాక్సులు తీసుకొని ఆయా మండలాల ఏఈవోలకు అందించాలి. సెల్​ఫోన్ నంబరును తప్పనిసరిగా ఇవ్వాలి. వారు ఆన్‌లైన్‌ చేసి ప్రతి రైతుకు 11అంకెల గుర్తింపు నంబరును(ఐడీ) ఇస్తారు. పీఎం కిసాన్‌ లబ్ధిదారులకు ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం తప్పనిసరి" - తిరుమల ప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి, కామారెడ్డి

అన్నదాతలకు గుడ్ న్యూస్ - ఈ యాప్​తో పంట తెగుళ్లు, వైరస్​లను ఇట్టే తెలుసుకోవచ్చు!

రైతులకు RBI గుడ్​న్యూస్- ఇకపై తాకట్టు లేకుండా రూ.2లక్షల లోన్!