ETV Bharat / state

అమెరికా నుంచి అమ్మ రాగానే పెళ్లి! - నాలుగు రాష్ట్రాల్లో 24 కేసులు - FAKE MATRIMONY CHEATER ARREST

మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో తప్పుడు సమాచారం - వివాహం చేసుకుంటానని నమ్మించే మోసం - నాలుగు రాష్ట్రాల్లో 24 కేసులు నమోదు - బెంగళూరులో అరెస్టు చేసిన హైదరాబాద్​ పోలీసులు

Fake Matrimony Cheater Arrested in Hyderabad
Fake Matrimony Cheater Arrested in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : March 16, 2025 at 6:09 PM IST

2 Min Read

Fake Matrimony Cheater Arrested in Hyderabad : తప్పుడు సమాచారంతో మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ల వేదికగా వివాహం చేసుకుంటానంటూ తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడుల్లో పలువురు యువతుల నుంచి పెద్ద ఎత్తున డబ్బు కాజేసిన మోసగాడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిపై తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడుల్లో 24 కేసులున్నాయి. రెండు సార్లు జైలుకు వెళ్లి వచ్చినా తీరు మార్చుకోకుండా మోసాలకు పాల్పడి మళ్లీ కటకటాలపాలయ్యాడు. జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి, డీఐ మధుసూదన్ శనివారం తెలిపిన వివరాల ప్రకారం,

బెంగళూరులో అరెస్టు : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన జోగాడ వంశీకృష్ణ అలియాస్ హర్ష చెరుకూరి(33) పలు మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో యానాంకు చెందిన ఎమ్మెల్యే ఫొటోతో వివరాలు నమోదు చేసి తాను ఎన్నారై, వ్యాపారి, ఐటీ ఉద్యోగిని అంటూ రెండో వివాహం కోసం చూస్తున్న వారు, మూడు పదుల వయసు దాటిన వారే లక్ష్యంగా వల విసిరేవాడు. తన తల్లి అమెరికాలో వైద్యురాలని, తాను స్థానికంగా ఉంటూ వ్యాపారం చేస్తుంటానని, అమెరికా నుంచి అమ్మ రాగానే పెళ్లి చేసుకుందామంటూ నమ్మించేవాడు. ఇటీవల జూబ్లీహిల్స్​కు చెందిన ఒక వైద్యురాలికి మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా నిందితుడు పరిచయమై, అత్యవసర ఖర్చులంటూ రూ.10.94లక్షలు తీసుకొని ముఖం చాటేశాడు. డబ్బు తిరిగి ఇవ్వమని అడిగితే నగ్న వీడియోలు తయారు చేయించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానంటూ బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టి ఈనెల 13న నిందితుడు బెంగళూరులో ఉన్నట్టు గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

ఓ శాసన సభ్యుడి ఫొటో డీపీగా పెట్టుకొని : వంశీకృష్ణ బీటెక్ మధ్యలోనే ఆపేసి 2014 సంవత్సరంలో హైదరాబాద్ వచ్చాడు. ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్లకు అలవాటు పటి 2016 సంవత్సరంలోలో జాబ్ కన్సెల్టెన్సీలో చేరి యువకులను ఉద్యోగాల పేరిట మోసం చేసి అరెస్ట్​ అయ్యాడు. జైలు నుంచి విడుదలై సోషల్ మీడియాలో ఆడవాళ్ల పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించి తన ఆదాయంలో అధిక శాతం సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తున్నట్టు మహిళలు, యువతులను నమ్మించి, వారినీ భాగస్వామ్యం కావాలంటూ సుమారు వెయ్యి మంది నుంచి డబ్బు వసూలు చేశాడు. తరువాత యానాంలోని ఓ శాసన సభ్యుడి ఫొటో డీపీగా పెట్టుకొని ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తానంటూ50 మంది మహిళలు, యువతుల నుంచి రూ.2.50కోట్లు కాజేశాడు.

పెళ్లి కోసం మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసుకున్నారా? - ఇలాంటి కేటుగాళ్లుంటారు భద్రం

భర్తను రెండో పెళ్లి చేసుకోమని చెప్పిన భార్య - షాదీకి ఓకే చెప్పిన అందమైన మహిళ - ట్విస్ట్ ఏంటంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.