FAKE NOTES IN TANUKU: దొంగ నోట్ల కేసులో ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తణుకు పట్టణానికి చెందిన పినిశెట్టి చక్రధర్ అనే వ్యక్తి స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్లో 83 దొంగ నోట్లను తన ఖాతాలో జమ అయ్యేలా సీడీయం మిషన్లో వేశాడు. అవి దొంగ నోట్లు కావడంతో ఖాతాలో జమ కాకపోగా మిషన్ లోనే ఉండిపోయాయి. విషయం తెలుసుకున్న బ్రాంచ్ డిప్యూటీ మేనేజర్ వాటిని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నోట్లు బ్యాంకు సీడీయంలో వేసిన చక్రధర్ తో పాటు మరో నలుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి 838 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన మరో ఇద్దరు వేరువేరు కేసుల్లో జైల్లో ఉన్నారని తాడేపల్లిగూడెం డీఎస్పీ విలేకరులకు తెలిపారు. ఐదుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.1,67, 600 విలువ గల 838 నోట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
"అడబాల అంజనేయమూర్తి, అతడి అసిస్టెంట్ నాగరాజు, దిగమర్తి ఏసు, తోట రామచందర్రావ్ అలియాస్ సోమేశ్వర్రావ్ మిగిలిన ఇద్దరు వేరే కేసుల్లో జైల్లో ఉన్నారు. వీరి వద్ద నుంచి చక్రధర్ అనే వ్యక్తి దొంగ నోట్లను తీసుకొచ్చి బ్యాంకులో మార్చే ప్రయత్నం చేశాడు. ఎస్బీఐ డిప్యూటీ మేనేజర్ తణుకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి ముఠాను పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న 838 నోట్లను సీజ్ చేశారు." -తాడేపల్లిగూడెం డీఎస్పీ
కరెన్సీ నోట్లు కావవి - కలర్ జిరాక్స్
రూ. 2లక్షలకు 10లక్షల విలువైన నకిలీ నోట్లు- ఫేక్ ప్రింటింగ్ ప్రెస్ గుట్టురట్టు