Excavator On A Huge Building : పై చిత్రాన్ని చూసి అంతపెద్ద భవనంపైకి పొక్లెయిన్ ఎలా వెళ్లిందబ్బా అని ఆశ్చర్యపోతున్నారా? అసలు ఎందుకు అంతఎత్తైన బిల్డింగ్‌పైకి పొక్లెయిన్ వెళ్లింది? ఏవిధంగా దానిని అంతఎత్తుకు చేర్చారు అనే సందేహాలు రావడం సహజమే. అయితే ఇప్పుడు వాటన్నింటి గురించి వివరంగా తెలుసుకుందాం.
ఇదీ జరిగింది : వివరాల్లోకి వెళితే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 రెయిన్బో ఆసుపత్రి ఎదురుగా ఓ బహుళ అంతస్తుల భవనాన్ని కూల్చివేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూల్చివేత కోసం పొక్లెయిన్‌ను 150 టన్నుల సామర్థ్యం కలిగిన ఓ భారీ క్రేన్ సహాయంతో భవనంపైకి చేర్చారు. అనంతరం బిల్డింగ్‌ను నేలమట్టం చేసే పనిని పొక్లెయిన్ ప్రారంభించింది. ఆ మార్గంలో వెళ్లేవారందరూ దీనిని ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఆగి మరీ పొక్లెయిన్‌ను పైకి ఎలా తీసుకెళ్లారా అని ఆరా తీస్తున్నారు.
'బస్సు వేసేదెప్పుడో.. కష్టాలు తీరేదెప్పుడో?'.. JCBలో స్కూల్‌కు విద్యార్థులు!