English Medium in Slum Schools : రాజధాని నగరం హైదరాబాద్‌లో ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ప్రాథమిక స్థాయి నుంచి పదో తరగతి వరకూ ఇంగ్లీష్ మీడియంలోనే విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా పాఠశాలలను ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్‌లోని బస్తీలు, కాలనీల్లో కొన్ని స్కూళ్లను ఎంపిక చేసి, వాటిని ఇంగ్లీష్ మీడియం పాఠశాలలుగా మార్చుతోంది. ఇలా ప్రస్తుతం 53 స్కూళ్లు ఉండగా క్రమక్రమంగా వీటి సంఖ్యను పెంచనున్నారు.
ప్రత్యేక శిక్షణ అవగాహన : ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో ఆంగ్లంలో బోధించేలా ఉపాధ్యాయులకు విద్యాశాఖ అధికారులు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తున్నారు. డిజిటల్ పద్ధతిలో తెరపై పాఠాలను పిల్లలతో చదివించాలని సూచిస్తున్నారు. రోజువారీ పనుల్లో మాట్లాడే ఇంగ్లీష్ పదాలను విద్యార్థులతో చెప్పించి, ఆంగ్లభాష అంటే కష్టం కాదని వారికి అవగాహన కల్పిస్తున్నారు.
బస్తీ బడులకు పెరుగుతున్న ఆదరణ : వారానికి ఒకసారి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలకు వెళ్లి విద్యార్థులు ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారా? ఎలాంటి పదాలు పలుకుతున్నారు? అన్న అంశాలను క్లియర్‌గా తెలుసుకుంటున్నారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఈ బస్తీ బడులకు ఆదరణ పెరుగుతుండటంతో ప్రవేశాల సంఖ్య పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుత విద్యా సంవత్సరంలో సగటున ప్రతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 20 మంది విద్యార్థులు అదనంగా చేరారు.
స్పందన బాగుంది. సౌకర్యాలు మరింత బాగుంటే : హైదర్‌గూడ, సబ్జిమండి ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తితో ముందుకొస్తున్నారు. వీటిలో 150 మంది పైచిలుకు పిల్లలున్నారు. అవసరమైన టీచర్లను నియమించడం, మౌలిక వసతులు పెంచడం వంటి చర్యలు చేపడితే విద్యార్థుల సంఖ్య 200 చేరే అవకాశాలున్నాయి. హైదరాబాద్ జిల్లాలో గతంలోనే పూర్తిగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి. ప్రస్తుతం వీటిని మరింత మెరుగ్గా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని జిల్లా విద్యాశాఖాధికారి ఆర్.రోహిణి వెల్లడించారు. ఇటీవలే కొత్తగా వచ్చిన టీచర్లలో చాలా మంది ఇంగ్లీష్ వారేనని వివరించారు.
Mana ooru Mana Badi program : భలే మంచి మాస్టార్.. 'బడిబాట'ను ఎంత బాగా ప్రచారం చేస్తున్నారో..!