ETV Bharat / state

రాష్ట్రంలో భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం - పెరుగుతున్న ఎండలే కారణమా? - POWER CONSUMPTION INCREASED

రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న విద్యుత్‌ వినియోగం - ఇవాళ అత్యధికంగా 15,752 మెగావాట్ల విద్యుత్‌ వినియోగం - రాష్ట్రంలో ఎండలు పెరుగుతుండంతో పెరుగుతున్న విద్యుత్‌ వాడకం

Power Consumption Increased
Power Consumption Increased (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 6, 2025, 10:16 PM IST

Power Consumption Increased In Telangana : తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 15,752 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. గత ఏడాది మార్చి 8న అత్యధికంగా 15,623 మెగావాట్ల డిమాండ్​ను అధిగమించినట్లు విద్యుత్​శాఖ ప్రకటించింది. వ్యవసాయానికి, పరిశ్రమలకు విద్యుత్ వినియోగం పెరగడంతో పాటు గృహవినియోగం భారీగా పెరగంతోనే విద్యుత్ డిమాండ్ నమోదు అవుతుందని విద్యుత్ శాఖ అంచనావేస్తుంది. ఈ ఏడాది విద్యుత్ డిమాండ్ 17,000ల మెగావాట్లకు చేరుకుంటుందని విద్యుత్ శాఖ అంచనావేస్తుంది. విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నామని విద్యుత్ శాఖ స్పష్టం చేసింది.

భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు : రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. ఫిబ్రవరిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో పాటు ఫ్యాన్లు, ఏసీలు, కూలర్ల వినియోగం భారీగా పెరిగిపోతుంది. ఒకపక్క యాసంగి పంటలకు సైతం విద్యుత్ వినియోగిస్తున్నారు. మరోపక్క పరిశ్రమలకు వినియోగం భారీగా పెరిగిపోయింది. గృహవినియోగం కూడా భారీగానే పెరిగిపోయినట్లు విద్యుత్ శాఖ అంచనావేస్తుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదు అవుతుందని విద్యుత్ శాఖ భావిస్తుంది.

గత ఏడాది డిసెంబర్ నెలలో 12,666 మెగావాట్లు నమోదు కాగా, ఈ ఏడాది డిసెంబర్ లో 14,375 మెగావాట్ల విద్యుత్ డిమాండ్​కు చేరుకుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది 13.49శాతం విద్యుత్ అధికంగా పెరిగిందని విద్యుత్ శాఖ భావిస్తుంది. గత ఏడాది జనవరిలో 13,810 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైతే ఈ ఏడాది 15,205 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది అదనంగా 10.10శాతం డిమాండ్ పెరిగింది.

రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ వినియోగం : రాష్ట్రంలో విద్యుత్ వినియోగం కూడా భారీగానే పెరిగిపోతుంది. గత ఏడాది డిసెంబర్ లో 207.68 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగితే ఈ ఏడాది డిసెంబర్ లో 235.25 మిలియన్ యూనిట్ల వినియోగం జరిగింది. గత ఏడాదితో పోల్చితే 13.28శాతం పెరిగింది. ఈ ఏడాది జనవరిలో 243.12 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటే ఈ ఏడాది జనవరిలో 260.56 మిలియన్ యూనిట్ల డిమాండ్​కు పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే 7.17శాతం అదనంగా పెరిగినట్లు విద్యుత్ శాఖ అధికారులు అంచనావేస్తున్నారు.

ఉత్పత్తి సంస్థల విద్యుత్ యూనిట్​కు రూ.4.50 ఉన్న సమయంలో రూ.2.72 కే ఎక్స్ఛేంజీల నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం ద్వారా విద్యుత్ సంస్థలు భారీగా ఆదా చేసినట్లు ట్రాన్స్ కో సీఎండీ కృష్ణభాస్కర్ తెలిపారు. తక్కువ ధరకే ఎక్స్ఛేంజీల ద్వారా విద్యుత్ కొనుగోలు చేయడంతో గడిచిన 13 నెలల్లో విద్యుత్ సంస్థలకు వెయ్యికోట్ల రూపాయల వరకు ఆదా అయినట్లు ఆయన పేర్కొన్నారు.

జనవరిలో రూ.185.27 కోట్లు ఆదా చేశాం : ఇటీవల డిసెంబర్, జనవరి మాసాల్లో ఒక్కో యూనిట్​కు సరాసరి రూ.2.69 రూపాయల నుంచి రూ.2.89 రూపాయల మధ్య ఎక్ఛ్సేంజీలో కొనుగోలు చేసినట్లు కృష్ణభాస్కర్ తెలిపారు. ఆ సమయంలో థర్మల్ స్టేషన్ లను బ్యాకింగ్ డౌన్ చేయడం వల్ల సాధారణంగా ఒక్కో యూనిట్ విద్యుత్ కు రూ.3.97 ల నుంచి రూ.4.18 వరకు యూనిట్ కు అయ్యే ఖర్చును తగ్గించగలిగామన్నారు. తద్వారా డిసెంబర్ లో రూ.196 కోట్లు, జనవరిలో రూ.185.27 కోట్లు ఆదా చేశామన్నారు.

ఈ ఏడాది మార్చి, ఏప్రీల్ లో విద్యుత్ వినియోగం 17,000ల వరకు పెరుగుతుందని విద్యుత్ శాఖ అంచనావేస్తుంది. విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినప్పటికీ విద్యుత్ శాఖ అందుకు సిద్దంగా ఉందని పేర్కొంది. ఏఈ స్థాయి అధికారుల నుంచి సీఎండీ స్థాయి అధికారుల వరకు క్షేత్రస్థాయిలో తిరుగడంతో పాటు, వేసవి విద్యుత్ ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. అవసరమైన ట్రాన్స్ ఫార్మర్లను, విద్యుత్ పరికరాలను అందుబాటులో ఉంచుకుంటున్నారు.

హైదరాబాద్​లో ఫిబ్రవరి నుంచే సుర్రు సుర్రు - విద్యుత్ మీటర్లు గిర్రు గిర్రు!

ఒక యూనిట్ విద్యుత్ ఆదా చేయడం అంటే - యూనిట్ ఉత్పత్తి చేసినట్లే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.