Eighty One Year Old man Venkatasubba Rao Participated in Powerlifting Competition : 80 వ వయసులో ఎవరైనా తమ పనులు తాము చేసుకుంటే చాలని అనుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటే అదే పది వేలు అని భావిస్తారు. కానీ ఆయన మాత్రం 81 సంవత్సరాల వయసులో బరువులు ఎత్తుతూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు పల్లెబోయిన వెంకటసుబ్బారావు.
జిల్లా జట్టులో స్థానం : ఖమ్మం నగరంలోని అంబేడ్కర్ భవన్‌లో ఆదివారం ఉమ్మడి జిల్లా పవర్ లిఫ్టింగ్ జట్ల ఎంపికలు నిర్వహించారు. ఇందులో పాల్గొనేందుకు వచ్చిన పల్లెబోయిన వెంకటసుబ్బారావు 110 కిలోల బరువు ఎత్తారు. విశ్రాంత ఉద్యోగి అయిన ఆయన తన 60 సంవత్సరం నుంచి క్రీడల్లో పాల్గొనడం అలవాటుగా మార్చుకున్నారు వెంకటసుబ్బారావు. పవర్ లిఫ్టింగ్ పోటీలో పాల్గొని జిల్లా జట్టులో స్థానం దక్కించుకున్నారు.
యువ క్రీడాకారులకు స్ఫూర్తి : ఈ సందర్భంగా త్వరలో జరుగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటానని వెంకటసుబ్బారావు చెప్పారు. జాబ్, కుటుంబ బాధ్యతలు తీరాక పూర్తి స్థాయిలో వ్యాయామాలు చేసుకుంటూ ఎక్కడ పోటీలు జరిగినా అందులో పాల్గొనే ప్రయత్నం చేస్తున్నానని, చదువుకునే రోజుల నుంచే క్రీడాసక్తి ఉన్నా తీరిక, వీలు దొరకలేదని అన్నారు. ఆ క్రీడాభిలాష అలానే ఉండిపోయిందని, ఉద్యోగ విరమణ తరువాత నుంచి క్రీడా రంగంలోకి అడుగు పెట్టానని ఆయన చెప్పారు. పవర్ లిఫ్టింగ్ యువ క్రీడాకారుల మధ్య చురుగ్గా కదులుతూ వారిలో స్ఫూర్తిని నింపుతున్నారు.
'పవర్'ఫుల్ వృద్ధుడు- రష్యన్ IPLలో సత్తా! 57 ఏళ్ల వయసులో గోల్డ్ మెడల్