ETV Bharat / state

పాస్టర్‌ ప్రవీణ్‌ మృతి - ద్విచక్రవాహనంపై వెళ్తున్న సీసీటీవీ ఫుటేజ్​ను సేకరించిన పోలీసులు - PRESS MEET ON PASTOR PRAVEEN DEATH

పాస్టర్ ప్రవీణ్‌ మృతిపై ఎవరి దగ్గరైనా ఆధారాలుంటే ఇవ్వాలన్న తూర్పుగోదావరి ఎస్పీ నరసింహకిషోర్‌ - లభ్యమైన ఆధారాలపై లోతుగా దర్యాప్తు చేస్తామని వెల్లడి

East Godavari District SP Press Meet On Pastor Praveen Death
East Godavari District SP Press Meet On Pastor Praveen Death (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 26, 2025 at 7:53 PM IST

2 Min Read

East Godavari District SP Press Meet On Pastor Praveen Death: రోడ్డు పక్కన మృతదేహం ఉందని మంగళవారం ఉదయం తెలిసిందని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ తెలిపారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారన్నారు. మృతదేహం పక్కనే సెల్‌ఫోన్‌ గుర్తించారన్నారు. చివరి ఫోన్‌ కాల్‌ రామ్మోహన్‌ ఆర్‌జేవైకి వెళ్లినట్టుగా ఉందని తెలిపారు. పోలీసులు ఆయనకు ఫోన్‌ చేయగా రామ్మోహన్‌, అతని భార్య ఘటనాస్థలికి చేరుకుని ఆ మృతదేహం ప్రవీణ్‌దిగా గుర్తించారన్నారు. ప్రవీణ్‌ హైదరాబాద్‌లో ఉంటారని, వివిధ ప్రాంతాల్లో మత బోధకుడిగా సేవలందిస్తారని తెలిపారు. దీంతో హైదరాబాద్‌లో ఉన్న ఆయన కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చామని ఎస్పీ అన్నారు.

ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌తో విచారణ: ప్రవీణ్‌ బావమరిది నిన్న సాయంత్రం వచ్చి అనుమానాస్పద మృతిగా ఫిర్యాదు ఇవ్వడంతో ఎఫ్ఐఆర్‌ నమోదు చేశామని ఎస్పీ వెల్లడించారు. పాస్టర్ ప్రవీణ్‌ మృతిపై జిల్లా ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు. "ప్రవీణ్ మృతి చెందిన ఘటనా స్థలిలో డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీమ్‌తో కొన్ని ఆధారాలు సేకరించాము. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌తో విచారణ జరిపించాలని నిర్ణయించాము. టీమ్‌ ఆఫ్‌ డాక్టర్స్‌తో పోస్టుమార్టం చేయించాము. ఈ ప్రక్రియ మొత్తం వీడియో రికార్డింగ్‌ చేయించాము. కొవ్వూరు టోల్‌ గేట్‌ సమీపంలో ప్రవీణ్‌ ద్విచక్రవాహనంపై వెళ్తున్నట్టు సీసీటీవీ ఫుటేజ్ సేకరించాము.

సోమవారం రాత్రి 11.43 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగినట్టు సీసీటీవీ ఫుటేజ్‌ని బట్టి తెలుస్తోంది. మాకు లభ్యమైన ఆధారాలపై లోతుగా దర్యాప్తు చేస్తాము. కేసు విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాము. ఈ కేసుకు సంబంధించి ఎవరి దగ్గరైనా ఆధారాలు ఉంటే ఇవ్వండి. పోస్టు మార్టం అనంతరం ఆందోళనకారులను ఒప్పించి మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించడం జరిగింది’’ అని ఎస్పీ తెలిపారు.

అయితే హైదరాబాద్‌ తిరుమలగిరి సమీపంలోని ఎస్‌బీహెచ్‌ కాలనీకి చెందిన క్రీస్తు సందేశకుడు, ప్రసంగికుడు పగడాల ప్రవీణ్‌కుమార్‌(45) మృతి చెందిన విషయం తెలిసిందే. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు కొంతమూరు వద్ద రోడ్డు పక్కన ప్రవీణ్‌ మృతదేహాన్ని మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించారు. రోడ్డు ప్రమాదంలో ప్రవీణ్ మృతి చెందలేదని, హత్యేనని పాస్టర్లు ఆందోళనకు దిగారు. దీంతో స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

ఎంపీపీ ఎన్నికలో ఉద్రిక్తత - మారణాయుధాలతో వచ్చిన వైఎస్సార్సీపీ నాయకులు

పాస్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ మృతి - ఆందోళనకు దిగిన క్రైస్తవ సంఘాలు - విచారణకు సీఎం ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.