Telangana DSC Exam Key Released : రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ పరీక్ష కీ విడుదలైంది. పరీక్ష కీతో పాటు రెస్పాన్స్ షీట్లను విడుదల చేసినట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ ఏడాది జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు మొత్తం 11,062 పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం డీఎస్సీ పరీక్షను నిర్వహించింది. దాదాపు రెండున్నల లక్షల మందికి పైగా అభ్యర్థులు ఎగ్జామ్కు హాజరయ్యారు. కంప్యూటర్ (సీబీటీ) పద్ధతిలో జరిగిన ఈ పరీక్షకు సంబంధించిన కీ విడుదల చేసిన పాఠశాల విద్యా శాఖ, స్కూల్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.
ఇక ఈ నెల 20వ తేదీ వరకు అభ్యర్థులు కీపై ఉన్న అభ్యంతరాలను తెలిపేందుకు విద్యాశాఖ అవకాశం కల్పించింది. మరోవైపు అభ్యర్థుల పేరు, పుట్టిన తేదీ వివరాలు, కులం, ఈడబ్ల్యూఎస్ వంటి వివరాలు తప్పుగా నమోదు అయినా, టెట్ స్కోర్ మార్పులకు సంబంధించి ఈ నెల 20లోపు ధ్రువపత్రాలను జతచేస్తూ ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.