ETV Bharat / state

కళ్లముందే వేలాది మద్యం సీసాలు - ఆగలేకపోయిన మందుబాబులు - DRUNKARDS LOOTED LIQUOR

Drunkards Loot Liquor in Andhra Pradesh: గుంటూరు జిల్లాలోని ఓ డంపింగ్ యార్డులో జరిగిన తతంగాన్ని చూసిన మందుబాబులు తట్టుకోలేకపోయారు. పోలీసులు అడ్డుకున్నా తగ్గేదేలేదంటూ ఎగబడ్డారు. ఒక్కసారిగా గుంపులుగా వచ్చి తమకు చేతికందిన మద్యం బాటిల్ పట్టుకుని పరుగందుకున్నారు.

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 10, 2024, 11:55 AM IST

DRUNKARDS LOOT LIQUOR
DRUNKARDS LOOT LIQUOR (ETV Bharat)

Drunkards Loot Liquor in Andhra Pradesh: కళ్ల ముందు ఒక విస్కీ బాటిల్ లేదా బ్రాందీ సీసా ఉంటేనే 'ఎప్పుడు మూత తీసి గొంతులో పోసుకుందామా' అని మందుబాబులు ఎదురుచూస్తుంటారు. అలాంటిది వంద కాదు రెండు వందలు కాదు ఏకంగా వేలాది మందు సీసాలను కళ్ల ముందే పోలీసులు ధ్వంసం చేస్తుంటే ఇక ఊరుకుంటారా. మందుబాబులకు ప్రాణం పోయినంత పనైంది.

గుంటూరు జిల్లా పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్​లలో స్వాధీనం చేసుకున్న మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేస్తుంటే మందుబాబులు చూస్తూ ఆగలేకపోయారు. ఖాకీలు లాఠీలు పట్టుకుని వారిస్తున్నా ఏ మాత్రం భయపడక విస్కీ, బ్రాందీ, రమ్ము, బీరు సీసాలను సొంతం చేసుకునేందుకు ఎగబడ్డారు. పోలీసులు చూస్తుండగానే మద్యం సీసాలు తీసుకొని పరుగందుకున్నారు.

గోవా నుంచి అక్రమ మద్యం - రూ.కోటి విలువైన 13 వేల బాటిళ్లు స్వాధీనం - police seized 13000 liquor bottles

గుంటూరు జిల్లా వ్యాప్తంగా 50 లక్షల రూపాయల విలువ చేసే 24,031 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఏటూకూరు రోడ్డులో నల్లచెరువులోని డంపింగ్‌యార్డులో మద్యం సీసాలను ధ్వంసం చేయడం ప్రారంభించారు. ఈ విషయం తెలిసి స్థానిక మందుబాబులు అక్కడకు చేరుకున్నారు. తమ కళ్లముందే మద్యం బాటిళ్లను ధ్వంసం చేస్తుంటే చూస్తూ ఉండలేకపోయారు.

యార్డు పరిసరాల్లోని మందుబాబులకు ప్రాణం పోయినంత పనైంది. ఎప్పుడు వాటిని తీసుకొని పారిపోదామా అని సరైన సమయం కోసం ఎదురుచూశారు. సాధారణంగా భారీ సంఖ్యలో మద్యం సీసాలు ఉన్నప్పుడు వాటిని రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేస్తుంటారు. అయితే ఈసారి మాత్రం పొక్లెయిన్‌ తీసుకురావడంతో మద్యం సీసాలను పగలగొట్టడానికి సమయం పట్టింది. ఇదే మందుబాబులకు అదునుగా మారింది.

ఆగలేకపోయాం సార్‌: వాటిని ధ్వంసం చేయడం ప్రారంభించిన కొద్దిసేపటికి ఉన్నతాధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీన్ని అవకాశంగా తీసుకున్న మందుబాబులు ఒక్కసారిగా గ్రూపులుగా అక్కడికి చేరుకున్నారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా కూడా వారికి మద్యం సీసాలు మాత్రమే కనిపించాయి. దొరికిన వారు దొరికినట్లు వివిధ రకాల మందు సీసాలను పట్టుకెళ్లారు. అయితే బాటిళ్లను పగలగొడుతుంటే చూస్తూ ఆగలేకపోయాం సార్‌ అని కొంతమంది మందుబాబులు పోలీసులతో పేర్కొనడం గమనార్హం.

ఏపీలో క్వార్టర్ బాటిల్ రూ.80 నుంచి 90 లోపే- కొత్త మద్యం పాలసీలో అదిరిపోయే ఆఫర్ - New Liquor Policy in AP

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.