Heat Waves in 66 Mandals of AP Tomorrow: రాష్ట్రవ్యాప్తంగా 66 మండలాల్లో రేపు (శనివారం) వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు సాధ్యమైనంతవరకు ఎండకు దూరంగా ఉండాలని, ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఎక్కువగా మంచినీరు, మజ్జిగ, గ్లూకోజు, నిమ్మరసం, కొబ్బరినీరు, ORS వంటివి తీసుకోవాలంటూ సందేశాన్ని పంపించింది.
మండలాల్లో వడగాల్పుల ప్రభావం: కృష్ణా జిల్లా గన్నవరం, కంకిపాడు, పెదపారుపూడి, ఉంగుటూరు, ఉయ్యూరు మండలాల్లో వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపింది. అల్లూరి-1, కాకినాడ-6, కోనసీమ-8, తూర్పుగోదావరి-3, పశ్చిమగోదావరి-1 ఏలూరు-7, కృష్ణా-9, ఎన్టీఆర్-4, గుంటూరు-14, బాపట్ల-7, ప్రకాశం-1 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నెల 13 తేదీన 10 మండలాల్లో తీవ్రంగా, 108 మండలాల్లో స్వల్పంగా వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ తెలిపింది.
41.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు: రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ కడప జిల్లాలోని అట్లూరులో అత్యధికంగా 41.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. ఆ తర్వాత ప్రకాశం జిల్లాలోని గుంటుపల్లిలో 41.2 డిగ్రీలు, నంద్యాల జిల్లా దొర్నిపాడు, పల్నాడు జిల్లా రావిపాడు 40.9 డిగ్రీలు, నెల్లూరు జిల్లా అయ్యపరెడ్డిపాలెంలో 40.7 డిగ్రీలు, ఏలూరు జిల్లా కామవరపుకోట, చిత్తూరు జిల్లా తవణంపల్లెలో 40.6 డిగ్రీలు, బాపట్ల జిల్లా వల్లపల్లిలో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మరో 25 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణా సంస్థ వెల్లడించింది.
నీటి సమస్య తీరాలా - వాననీటిని ఇలా చేయాలంటున్న రిటైర్డ్ ప్రొఫెసర్
మండుటెండల్లో జలసవ్వళ్లు - పర్యటకులను ఆకట్టుకుంటున్న తుంబురు తీర్థం