ETV Bharat / state

YUVA : సంకల్పం ముందు - వైకల్యం ఓడింది - ఈయన ఓ తరానికి ఇన్​స్పిరేషన్ - Disabled Man Inspiring Story

Disability Person Inspiring Story : అనుకోని ప్రమాదంలో 2 కాళ్లు కోల్పోయాడు. కళ్లు తెరిచేసరికి జీవితం చీకటైంది. అయినా ఆ యువకుడు చెక్కుచెదరలేదు. నిరాశ నిస్పృహలకులోనై జీవితాన్ని చేజార్చుకుంటే మళ్లీ తిరిగిరాదని ధైర్యంగా ముందడుగు వేశాడు. తన కోసం కాదు తనను నమ్ముకుని జీవిస్తోన్న వాళ్ల కోసం బతకాలనుకున్నాడు. కష్టం విసిరిన సవాల్‌కు ప్రతిసవాల్‌ చేస్తూ కొత్త జీవితం మొదలు పెట్టిన నాగరాజు కన్నీటి కథ ఇది.

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 26, 2024, 10:17 PM IST

Updated : Jul 26, 2024, 10:23 PM IST

YoungMan without Legs Doing Work in Mulugu
Disability Person Inspiring Story (ETV Bharat)

YoungMan without Legs Doing Work in Mulugu : జీవితం ఎప్పుడు ఒకలా ఉండదు. ఉంటే అది జీవితమే కాదు. అందుకు ఉదాహరణ ఈ వ్యక్తి. చావు అంచుల వరకు వెళ్లి 2 కాళ్లు పోగొట్టుకున్నాడు. అదృష్టం కొద్దీ బతికి బయటపడి జీవన పోరాటం చేస్తున్నాడు. అతడి సంకల్పం ఎలాంటి కష్టాల్లో ఉన్న వారికైనా సరే బతుకు మీద ఆశలు పుట్టించేలా చేస్తోంది. ఎన్నికష్టాలు ఎదురొచ్చినా ఎదురొడ్డి నిలవవచ్చని నిరూపిస్తోంది ఇతడి జీవితం.

ములుగు జిల్లా గోవిందరావు పేట మండలం నందమూరి కాలనీకి చెందిన ఇతను నాగరాజు. ఒకప్పుడు డీసీఎం డ్రైవర్‌గా పని చేసుకుంటూ భార్యబిడ్డలతో హాయిగా సాగింది ఇతని జీవితం. కానీ అనుకోని ప్రమాదంతో బతుకంతా ఒక్కసారిగా తల్లకిందులైంది. 2022 జనవరి 30న ఇతని జీవితంలో చీకటి రోజనే చెప్పాలి. హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయాడు. హాయిగా తిరిగే నాగరాజును, ఇదిగో ఇలా దివ్యాంగుడిగా మార్చింది ఆ ప్రమాదం.

చచ్చిపోదామని ప్రయత్నించి : ప్రమాద ఘటన తర్వాత కొన్ని రోజులకు స్పృహలోకి వచ్చి వాస్తవం తెలుసుకునే సరికి నాగరాజుకి జీవితం శూన్యమనిపించింది. ఇంకెందుకీ బతుకు అంటూ గుండెలవిసేలా ఏడ్చాడు. ఇంకొకరి సాయం లేనిదే కనీసం మంచం మీద నుంచి లేచే పరిస్థితి వచ్చిందని కుమిలిపోయాడు. ఇక చావే శరణ్యమనుకుని చచ్చిపోదామని ప్రయత్నించాడు. కానీ తనకున్న ఇద్దరు కన్న బిడ్డలు గుర్తుకు వచ్చి, ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నానని చెబుతున్నాడు.

రెండు కాళ్లు కోల్పోయి వైకల్యం వచ్చినందుకు బాధపడ్డాడు, ఆ తరువాత బాధను పక్కన పెట్టేశాడు నాగరాజు. ఎన్ని కష్టాలు వచ్చిన ఎదురొడ్డి నిలవాలని గట్టిగా సంకల్పించుకున్నాడు. ఆ సంకల్పం, ఆత్మస్ధైర్యం ముందు వైకల్యం వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయింది. మెల్లిగా తన భార్య లావణ్య సాయంతో కుట్టు మిషన్ పని నేర్చుకుని, అదే ఉపాధి మార్గంగా ఎంచుకున్నాడు. బుర్రకు పదునుపెట్టి మిషన్‌కే ఓ స్విచ్‌ను బిగించి దాని సాయంతో కాళ్ల అవసరం లేకుండానే కుట్టడం మొదలు పెట్టాడు నాగరాజు.

మిషన్ కుడుతూ, ఆటో నడుపుతూ : ట్రాక్టర్ టాపులు, బైక్ సీట్ కవర్లు కుడుతూ ఆదాయాన్ని గడిస్తున్నాడు నాగరాజు. ఇంకా ఆదాయం పెంచుకోవాలని భావించి పట్టుదలతో ఆటో కూడా నేర్చుకున్నాడు. కాళ్లు లేకపోతే ఆటో ఎలా నడుపుతారని చుట్టూ ఉన్న వాళ్లు అడిగిన ప్రశ్నకు బ్రేక్ పెడల్‌కు అనుసంధానిస్తూ ఒక రాడ్‌ని అమర్చుకుని సమాధానం ఇచ్చాడు. మిషన్ కుడుతూ, ఆటో నడుపుతూ ప్రస్తుతం భార్య బిడ్డలను, తల్లిదండ్రులను పోషించుకుంటున్నాడు.

వైకల్యం ఉన్నా తనకు కనీసం పింఛన్​ రావడం లేదని ఆవేదన చెందుతున్నాడు నాగరాజు. దీని కోసం రెండేళ్ల క్రితమే దరఖాస్తు చేసినా రాకపోవడంతో ఆశలు వదులుకున్నాడు. తన వైకల్యం వల్ల తమ్ముడు కూడా చదువుకు దూరమయ్యాడని బాధపడుతున్నాడు. ఊరి వాళ్ల సహకారంతో ఇటీవలే కృత్రిమ కాళ్లను అమర్చుకున్నాడు. అయితే జరిగిన దానికి తలుచుకుంటూ బాధపడితే ప్రయోజనం లేదంటాడు నాగరాజు.

ఆయన బతకుతాడని అనుకోలేదు : భర్త నాగరాజుకు జరిగిన ప్రమాదం గురించి తలుచుకుంటే ఇప్పటికీ చిగురుటాకులా వణికిపోతుంది భార్య లావణ్య. ఆయన బతకుతాడని అనుకోలేదని, కానీ బతకడమే కాకుండా బాధను మరచి మళ్లీ కొత్త జీవితం మొదలుపెట్టాడని చెపుతోంది. అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నట్లే మళ్లీ నాగరాజు కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తోంది. ఇప్పుడు రేపటి కోసం నాగరాజుకు దిగులు లేదు. నేటి గురించి ఆందోళన లేదు. ఘోర ప్రమాదం తనకు రెండు కాళ్లు లేకుండా చేసినా పట్టుదల, ఆత్మవిశ్వాసం, సాహసంతో జీవనం సాగిస్తూ ముందుకు సాగుతున్నాడు. దాతలు ఎవరైనా సాయం చేస్తే కుటుంబానికి మరింత భరోసాగా నిలుస్తానని చెబుతున్నాడు.

మాతృమూర్తి మమకారం - దివ్యాంగ కుమారుడి భవిష్యత్తుకు శ్రీకారం

అంగ వైకల్యం శరీరానికే.. ఆత్మవిశ్వాసానికి కాదు

Last Updated : Jul 26, 2024, 10:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.