Difference in Weights and Low Quality Standards In Prasadam : ఏలూరు జిల్లాలోని పలు ఆలయాల్లో ప్రసాదాల్లో మాధుర్యం కానరావడం లేదు. ప్రసాదాల తయారీల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. దొడ్డు బియ్యంతో పులిహోర తయారు చేయడం, రుచి లేకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. చక్కెర పొంగళి, లడ్డూలు వంటి ప్రసాదాల్లోనూ నిర్ణీత ప్రమాణాల ప్రకారం నెయ్యి, ఇతర సరకులు వినియోగించని పరిస్థితి నెలకొంది.
నాణ్యత అంతంత మాత్రమే : ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో ప్రసాదాల నాణ్యత అంతంత మాత్రమే. ఆర్‌ఆర్‌పేట వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రసాదాల తూకాల్లో వ్యత్యాసాలు ఉంటున్నాయి. పర్యాటక శాఖ గణాంకాల ప్రకారం గత నెలలో 6 లక్షల మంది భక్తులు ఆలయాలను దర్శించారు. ఆలయంలో గతంలో సన్నబియ్యంతో పులిహోర తయారు చేసేవారు. ఒక్కో సారి లావు బియ్యంతో చేస్తున్నారని భక్తులు ఆవేదన చెందుతున్నారు. ప్రసాదాల తయారీదారులకు బియ్యం, సామగ్రి, నెయ్యి తదితర ముడి సరకులు దేవస్థానమే ఇవ్వాలి. కానీ ప్రస్తుతం దేవస్థానం వీటిని సరఫరా చేయడం లేదు. దీనివల్ల తయారీదారులు తమకు ఇష్టమొచ్చిన సరకులు ఉపయోగిస్తున్నారు.
తక్కువ బరువు కలిగిన లడ్డూలు : ఏలూరు ఆర్‌ఆర్ పేటలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులకు విక్రయించే ప్రసాద తూకాల్లో తేడాలుంటున్నాయి. ఇక్కడ ఒక్కో లడ్డూ రూ.15కు విక్రయిస్తున్నారు. లడ్డూ బరువు 80 గ్రాములు అని నోటీసు బోర్డులో పేర్కొన్నా అంతకంటే తక్కువ బరువు కలిగి ఉంటోందని భక్తులు మండిపడుతున్నారు. పులిహోర పొట్లం పరిస్థితి కూడా ఇంతే. నిల్వ ప్రసాదాలను విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ ఏసీ చెన్ను రంగారావు పేర్కొన్నారు.
శిర్డీ వెళ్లే భక్తులకు అలర్ట్- ఇకపై ఉచిత భోజనానికి టోకెన్ తప్పనిసరి!
తిరుమల భక్తులకు గుడ్న్యూస్ - కావాల్సినన్ని లడ్డూలు - ఎప్పటినుంచో తెలుసా?