Unique Tradition in Kurnool : పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందని అక్కడి ప్రజల నమ్మకం. దీంతో ఆ గ్రామంలోని వారు పూజారి తన్నుల కోసం బారులు తీరుతారు. ఇదే సంప్రదాయాన్ని 500 ఏళ్లుగా పాటిస్తున్నారు. ఇంతకీ ఏంటీ ఈ సంప్రదాయం? ఎందుకు పాటిస్తున్నారు? దీని వెనుక అసలు కథేంటి? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
కర్నూలు జిల్లాలోని ఆస్పరి మండలం చిన్నహోతూరు గ్రామంలో శ్రీ సిద్ధరామేశ్వరస్వామి ఆలయం ఉంది. ఇక్కడ ప్రతి ఏటా ఏప్రిల్లో ఉత్సవాలను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా వేడుకల చివరి రోజున శివపార్వతులకు కల్యాణం జరిపిస్తారు. అయితే ఆ కార్యక్రమంలో భక్తులు కొన్ని తప్పులు చేశారనే ఆగ్రహంతో వీరభద్ర స్వామి ఆలయ పూజారి రూపంలో ఉత్సవ విగ్రహాలను తలమీద పెట్టుకొని ఆగ్రహంతో నాట్యం చేస్తూ భక్తులను కాలితో తంతారు.
Siddarameshwara Temple Tradition : ప్రతి ఏటా ఆచారంగా వచ్చే ఈ సంప్రదాయ ఉత్సవాన్ని ఈసారి కూడా ఘనంగా నిర్వహించారు. పూజారితో తన్నులు తిన్న భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమం అనంతరం శ్రీ సిద్ధరామేశ్వరస్వామికి వసంతోత్సవం జరిపించారు. ఇది ముగిసిన వెంటనే గ్రామస్థులు ప్రత్యేకంగా గ్రామంలో ఏర్పాటు చేసుకున్న పెద్ద గుంతల్లో గులాబీ రంగు కలిపిన నీటిని మొక్కుగా సమర్పించారు.
ఆ రంగు నీళ్లతో వసంతోత్సవాన్ని సంబంరంగా జరుపుకున్నారు. ఇలా గ్రామమంతా ఒకే రంగును వినియోగించడం ఆనవాయితీగా వస్తోందని గ్రామస్థులు పేర్కొన్నారు. ఈ సంప్రదాయాన్ని చూసేందుకు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి చాలామంది అక్కడికి వస్తుంటారు. మరికొందరు ఆసక్తిగా దీన్ని గురించి తెలుసుకుంటారు.
ఆ ఊరంతా వలస వెళ్లే వింత ఆచారం - గుడికొత్తూరు కథేంటి? - Entire Village Migrated