Yadadri Lakshmi Narasimha Swamy Temple Rush : రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఇవాళ భక్తుల రద్దీ పెరిగింది. వేకువ జామునుంచే స్వామివారి దర్శనానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వరుస సెలవులు కావడంతో ఆలయానికి ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీ పెరగడంతో ఎలాంటి అవాంఛనీయ అధికారులు తగిన చర్యలు చేపట్టారు.
ధర్మ దర్శనానికి 3 గంటల సమయం : యాదాద్రి ఆలయానికి భక్తుల రద్దీ పెరగడంతో స్వామి వారి ధర్మ దర్శనంకు 3 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనంకి ఒక గంటన్నర సమయంపడుతోంది. క్షేత్ర పరిసరాలు భక్తుల సందడి కనిపిస్తుంది. దర్శన క్యూలైన్లు, ఆలయ మాఢ వీధుల్లు, కళ్యాణకట్ట, పుష్కరిణి,కొండపైబస్టాండ్, వ్రత మండపం ఘాట్ రోడ్డు వెంట భక్తులతో కిటకిటలాడుతున్నది. ఆలయంలో స్వామివారి నిత్య కళ్యాణం పర్వంలో సువర్ణ పుష్పార్చన, వేద ఆశీర్వచనం భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
యాదాద్రిలో భక్తుల రద్దీ - ఉచిత దర్శనానికి రెండు గంటల సమయం - RUSH IN YADADRI TEMPLE
యాదాద్రిలో వైభవంగా లక్ష పుష్పార్చన - వరుస సెలవులతో పెరిగిన రద్దీ - weekand holidays rush in yadadri