Tirupati and Machilipatnam special trains Details: వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. తిరుపతి - మచిలీపట్నం మధ్య 14 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఏప్రిల్ 13 నుంచి మే 25 వరకు ప్రతి ఆదివారం తిరుపతి - మచిలీపట్నం రైలు (07121) ఏప్రిల్ 14వ తేదీ నుంచి మే 26 వరకు ప్రతి సోమవారం మచిలీపట్నం - తిరుపతి (07122) మధ్య ఈ రైళ్లు నడుస్తాయి.
తిరుపతి-మచిలీపట్నం ప్రత్యేక రైలు (07121) ప్రతి ఆదివారం రాత్రి 10.20 గంటలకు తిరుపతిలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు మచిలీపట్నం చేరుకోనుంది. అలాగే, మచిలీపట్నం-తిరుపతి ప్రత్యేక రైలు (07122) ప్రతి సోమవారం సాయంత్రం 5.40 గంటలకు మచిలీపట్నంలో బయల్దేరి మరుసటిరోజు తెల్లవారుజామున 3.20 గంటలకు తిరుపతికి చేరుకోనుంది. ఇరువైపులా రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, గుడివాడ, పెడన స్టేషన్లలో ఆగే ఈ ప్రత్యేక రైళ్లలో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్‌తో పాటు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
"ఈ వేసవి చల్లచల్లగా గడిచేలా IRCTC టూర్ ప్లాన్" - విజయవాడ నుంచి భారత్ గౌరవ్ ప్రత్యేక రైళ్లు
చర్లపల్లి-శ్రీకాకుళం ప్రత్యేక రైళ్ల వేళలు: అలాగే చర్లపల్లి- శ్రీకాకుళం రోడ్డు మధ్య మొత్తం 24 సర్వీసులు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఏప్రిల్ 11 నుంచి జూన్ 27 వరకు ప్రతి శుక్రవారం చర్లపల్లి- శ్రీకాకుళం రోడ్డు రైలు (07025); ఏప్రిల్ 12వ తేదీ నుంచి జూన్ 28 వరకు ప్రతి శనివారం శ్రీకాకుళం రోడ్డు- చర్లపల్లి (07026) మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.
చర్లపల్లిలో ప్రతి శుక్రవారం రాత్రి 9.15 గంటలకు బయల్దేరనున్న రైలు (07025) మరుసటి రోజు మధ్యాహ్నం 12.15 గంటలకు శ్రీకాకుళం రోడ్డుకు చేరుకుంటుంది. అలాగే, ప్రతి శనివారం శ్రీకాకుళం రోడ్డు నుంచి బయల్దేరనున్న రైలు (07026) మరుసటి రోజు ఉదయాన్నే 6 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుందని అధికారులు పేర్కొన్నారు.
ఈ స్టేషన్లలో ఆగుతాయి: ఇరువైపులా నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, చీపురపల్లి స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి. ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.
రైల్వే శాఖ కీలక నిర్ణయం - ఇక ఆ రైళ్లు సికింద్రాబాద్ వెళ్లవు!