Details of summer special trains from Visakha: వేసవి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. విశాఖ -బెంగళూరు, విశాఖపట్నం - తిరుపతి, విశాఖపట్నం - కర్నూలు సిటీ మధ్య మొత్తం 42 వేసవి వీక్లీ ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఏప్రిల్ 13 నుంచి మే నెలాఖరు వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి.
విశాఖపట్నం - బెంగళూరు (14): విశాఖపట్నం - బెంగళూరు (ట్రైన్ నం.08581/08582) ఆదివారం, తిరుగు ప్రయాణంలో సోమవారాల్లో ఈ రైలు అందుబాటులో ఉంటుంది. దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడురు, రేణిగుంట, జోలార్‌పేట్, కుప్పం, బంగారుపేట, కృష్ణరాజపురం స్టేషన్లలో ఆగుతుంది. 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ కోచ్‌లు ఉంటాయి.

విశాఖపట్నం - తిరుపతి (14): విశాఖపట్నం నుంచి తిరుపతికి (08547) ప్రతి బుధవారం, తిరుగు ప్రయాణంలో (08548) గురువారాల్లో ఈ రైలు అందుబాటులో ఉంటుంది. దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, కైకలూరు, గుడివాడ, విజవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలోఆగుతుంది. 2ఏసీ, 3ఏసీ, జనరల్ కోచ్‌లు ఉంటాయి.
రైల్వే శాఖ కీలక నిర్ణయం - ఇక ఆ రైళ్లు సికింద్రాబాద్ వెళ్లవు!
విశాఖ - కర్నూలు సిటీ (14): ప్రతి మంగళవారం విశాఖ నుంచి కర్నూలు సిటీకి (08545), తిరుగు ప్రయాణంలో బుధవారాల్లో (08546) రైలు అందుబాటులో ఉంటుంది. దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, వినుకొండ, మార్కాపురం, కంభం, గిద్దలూరు, దిగువమెట్ట, నంద్యాల, డోన్ స్టేషన్లలో ఆగుతుంది. 2ఏసీ, 3ఏసీ, జనరల్ కోచ్‌లు ఉంటాయి. ఈ రైళ్లు తేదీల వివరాలు వెల్లడయ్యాయి గానీ, ఏ సమయానికి బయల్దేరతాయనే వివరాలు వెల్లడించలేదు.
Cherlapalli to Tirupati: చర్లపల్లి నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఇటీవల దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకొని వారంలో రెండు రోజుల చొప్పున అదనంగా ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఏప్రిల్ 6వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ సర్వీసులు మే 31వ తేదీ వరకు నడవనున్నాయి. చర్లపల్లి నుంచి తిరుపతికి శుక్ర, ఆదివారాల్లో, తిరుపతి నుంచి చర్లపల్లికి శనివారం, సోమవారం ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.
IRCTC భారత్ గౌరవ్ యాత్ర - తక్కువ ఖర్చుతో పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక రైళ్లు