డెస్టినేషన్ వెడ్డింగ్ కేంద్రంగా తెలంగాణ! - ఇక కేరళ, కులుమనాలి వెళ్లాల్సిన పనే లేదు
రాష్ట్రంలో 30 ప్రాజెక్టుల కోసం ఎంఓయూ - 14 పీపీపీ విధానం రూపకల్పన - అనంతగిరి అడవుల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ కేంద్రాలు

Published : October 4, 2025 at 3:02 PM IST
|Updated : October 4, 2025 at 3:10 PM IST
Destination Wedding Centers in Telangana : డెస్టినేషన్ వెడ్డింగ్ అంటేనే విదేశాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా బాగా డబ్బున్న వాళ్లు ఇలాంటి కల్చర్‌కు అలవాటు పడి విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. ఇలాంటి వారి వల్ల దేశానికి ఎకానమీ పరంగా ఎంతో నష్టం వస్తుంది. అదే మనదేశంలో వెడ్డింగ్ డెస్టినేషన్ నిర్వహిస్తే ఆదాయం భారీగా వస్తుంది. ఇప్పుడు ఈ సంప్రదాయం రాజస్థాన్, గోవా, కేరళలలో కూడా పాకింది. ఇక్కడి నుంచి అక్కడికి చాలా మంది వెళుతుంటారు. పెద్దపులి రాజసాన్ని కళ్లారా చూడ్డానికి మహారాష్ట్రలోని తాడోబా, రాజస్థాన్‌లోని రణతంబోర్లకు పయనమవుతున్నారు. ఆయా ప్రాంతాల్లో చక్కటి రిసార్టులు, వెల్నెస్ సెంటర్లు, భద్రత ఉండటంతో రెండు, మూడు రోజులు ఉంటున్నారు.
ఫలితంగా అక్కడ ఉపాధి, ఉద్యోగాల సృష్టి జరుగుతోంది. ఆ ప్రాంతాలకు ఏమాత్రం తగ్గని ప్రదేశాలు మన రాష్ట్రంలోనూ ఉన్నాయని ఎంత మందికి తెలుసు. కానీ అలాంటి ప్రదేశాలు ఎన్ని ఉన్నా ప్రచారం మాత్రం లేదనే చెప్పాలి. ఇంకా అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేకపోవడం, ప్రచారమూ జరగకపోవడంతో పర్యాటకులు ఆసక్తి అనేది చూపడం లేదు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రైవేటు సంస్థలతో కలిసి అడుగులు వేస్తోంది.
30 ప్రాజెక్టుల కోసం ఎంఓయూ : ఇలా ఏకంగా 30 ప్రాజెక్టుల కోసం ఇటీవల ఎంఓయూ కుదుర్చుకుంది. వాటిలో 14 పీపీపీ విధానంలో రూపుదిద్దుకోనున్నాయి. మిగతా వాటిని ప్రైవేటు సంస్థలే పూర్తిగా చేపట్టనున్నాయి. వికారాబాద్ అనంతగిరి అడవుల్లో వెడ్డింగ్ డెస్టినేషన్స్, హైదరాబాద్‌లోని తారామతి బారాదరిలో ఫైవ్ స్టార్ హోటల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వులో లగ్జరీ రిసార్ట్, నాగార్జున సాగర్‌లోని బుద్ధవనంలో వెల్నెస్, ధ్యాన కేంద్రాలు, ఎకో రిసార్టులు రిసార్టులు రానున్నాయి. ప్రాజెక్టులు సాకారమైతే రూ.15,279 కోట్ల పెట్టుబడులు, 19,520 మందికి ప్రత్యక్షంగా, మరో 30 వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని సంబంధిత శాఖ అంచనా వేస్తోంది.
ప్రకృతితో మమేకం అవుతూ :
- వికారాబాద్ అడవుల్లో ప్రకృతి ఒడిలో వద్ద 81 ఎకరాల్లో లావీ వెల్నెస్ రిట్రీట్ ప్రాజెక్టు రానుంది. జేడబ్ల్యూ మారియట్‌తో రిసార్ట్ నిర్మాణానికి ఒప్పందం కుదిరింది.
- నాగార్జునసాగర్‌లోని బుద్ధవనంలో కన్హా వెల్నెస్ రిసార్ట్ రానుంది. ఇక్కడే మోనాస్టిక్, సెక్యులర్ విద్యాసంస్థల కోసం మోనాస్ట్రీ ఏర్పాటుకు ప్రతిపాదన వచ్చింది.
- వికారాబాద్‌లో వైన్యార్డ్ రిసార్ట్, రాయదుర్గంలో ఫైవ్‌స్టార్ లగ్జరీ హోటల్-ట్రేడ్ సెంటర్, పుప్పాలగూడ, నియోపొలిస్, శంషాబాద్, బుద్వేల్‌లలో ఫైవ్‌స్టార్ హోటళ్లు రానున్నాయి.
- హైదరాబాద్‌లోని నిథమ్‌లో సప్తర్షి హోటల్ పునరుద్ధరణ జరగనుంది. శంషాబాద్‌లో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌తో నిర్మాణానికి ఒప్పందాలు కుదిరాయి. ఎయిర్‌పోర్టుకు దగ్గరలో ఐకానిక్ వెడ్డింగ్ డెస్టినేషన్ నిర్మాణానికి పలు సంస్థలు ముందుకొచ్చాయి. చిలుకూరు వద్ద ఫైవ్-స్టార్ రిసార్ట్ కన్వెన్షన్ సెంటర్, రామోజీ ఫిల్మ్ సిటీలో స్పెషల్ టూరిజం అట్రాక్షన్ ఇలా వివిధ ప్రత్యేక ప్రాజెక్టులు రూపుదిద్దుకోనున్నాయి.
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఇంటిగ్రేటెడ్ మైస్, ఫ్యూచర్ సిటీలో నోవాటెల్ వెల్నెస్ రిసార్టు, వికారాబాద్ కోటిపల్లి జలాశయంలో తాజ్ సఫారీ బ్రాండ్‌తో ఎకో రిసార్టు ఏర్పాటు కానున్నాయి.
న్యూ ట్రెండ్ గురూ : సెల్‌ఫోన్ పెళ్లికార్డును మీరెప్పుడైనా చూశారా?

