ETV Bharat / state

హైదరాబాద్​లో అద్దెకు కూలర్లు - నెలకు రూ.500ల నుంచే ప్రారంభం - COOLER RENTAL IN HYDERABAD

మండిపోతున్న ఎండలు - అద్దె కూలర్లవైపు మొగ్గు చూపుతున్న ప్రజలు - దీంతో భారీగా పెరిగిన డిమాండ్

Demand Increased for Cooler Rental in Hyderabad
Demand Increased for Cooler Rental in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 21, 2025 at 10:10 AM IST

1 Min Read

Demand Increased for Cooler Rental in Hyderabad : రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. దీంతో హైదరాబాద్​లో అద్దె కూలర్లకు డిమాండ్ పెరుగుతోంది. 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటం, ఉక్కపోత పెరగడంతో ఉపశమనం పొందేందుకు ఎక్కువ మంది కూలర్లు అద్దెకు తీసుకుంటున్నారు. కొనడం కంటే రెండు నెలలు అద్దెకు తీసుకుంటే సరిపోతుందని భావిస్తున్న యువకులు, విద్యార్థుల నుంచి ఎక్కువగా ఆర్డర్లు వస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

అశోక్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, అమీర్‌పేట, హైటెక్‌సిటీ, కొండాపూర్, మాదాపూర్​లో అద్దె కూలర్లకు డిమాండ్‌ ఉంది. కొత్త కూలర్ కొనాలి అంటే మార్కెట్​లో రూ.15 వేలు ఉంది. అదే అద్దెకు తీసుకుంటే నెలకు రూ.1000 నుంచి రూ.1,500తో సరిపోతుండటంతో ఎక్కువ మంది దీనివైపు మొగ్గు చూపుతున్నారు.

మార్కెట్‌లో అసెంబుల్డ్‌ కూలర్లు రూ.1,500, అంతకన్నా పెద్దవి రూ.3000-4,500 వరకు దొరుకుతున్నాయి. మూడు నెలలు వాడగానే మూలన పడేయడం, తర్వాత వచ్చే ఏడాది అవి పని చేయకపోవడం పరిపాటిగా మారుతోందని వినియోగదారులు చెబుతున్నారు. బ్రాండెడ్‌వి రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు ఉన్నాయి. ఉక్కపోత నుంచి తప్పించుకునేందుకు పొదుపుమంత్రం పాటిస్తున్నారు. అందుకు కూలర్లను అద్దెకు తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. సామర్థ్యం, బ్రాండ్‌ విలువను బట్టి రూ.500 నుంచి రూ.800 అద్దెకు వస్తున్నాయి. ఇందుకోసం ముందుగా రూ.2000 వరకు డిపాజిట్‌ చేయాలి. ‘రెంటల్‌ అప్లయన్సెస్‌’ పేరుతో ఆన్‌లైన్‌లోనూ లభ్యమవుతున్నాయి.

కూలర్లు వాడేవారికి హెచ్చరిక - ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలు పోతాయ్!

శరీరంలో తగినంత నీరు లేకపోతే ఏమవుతుందో తెలుసా? రోజుకు ఎంత వాటర్ తాగాలి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.