ETV Bharat / state

ఈ-మెయిల్ టిప్స్​ : ఈ ముఖ్య సూత్రాలు తెలిస్తే - 'నకిలీ మెయిల్స్​' ఇట్టే పట్టేయొచ్చు!

కొత్త కొత్త పద్ధతుల్లో డబ్బులు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లు - నకిలీ మెయిల్స్​ పంపి అవలీలగా మోసం చేస్తున్న ఘటనలు కోకొల్లలు - జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్న సైబర్​ క్రైం పోలీసులు

Cybercriminals with Fake Emails
Cybercriminals with Fake Emails (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : July 5, 2025 at 10:34 PM IST

|

Updated : July 6, 2025 at 7:57 AM IST

2 Min Read
Choose ETV Bharat

Cyber ​​Fraud With Fake Email : ఇటీవల సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పంథాలో ప్రజల సొమ్మును అవలీలగా కొట్టేస్తున్నారు. ఏపీకే ఫైల్స్, లింక్​లు, మెసేజ్​లు పంపి వాటిని ఓపెన్ చేసిన వినియోగదారుల బ్యాంక్​ అకౌంట్లలోని నగదును సెకన్ల వ్యవధిలో లాగేస్తున్నారు. ఇప్పుడు తాజాగా నకిలీ మెయిల్స్​​ పంపి బురిడీ కొట్టిస్తున్నారు. అయితే నకిలీ మెయిల్స్​ను గుర్తించడానికి 6 ముఖ్య సూత్రాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

పంపిన వారి మెయిల్ చిరునామాను క్షుణ్నంగా తనిఖీ చేయండి

మోసగాళ్లు తరచుగా అసలు కంపెనీ పేరుకు దగ్గరగా ఉండే నకిలీ మెయిల్​ ఐడీలను సృష్టిస్తారు.

1. స్పెల్లింగ్ తప్పులు : అసలు పేరుకు, నకిలీ పేరుకు మధ్య చిన్న చిన్న అక్షర దోషాలు ఉంటాయి.

నిజమైనది : support@hdfcbank.com

నకిలీ : support@hdfc_bank.com లేదా support@hdfc.co.in

డొమైన్ పేరు : పెద్ద కంపెనీలు ఎప్పుడూ @gmail.com, @yahoo.com వంటి పబ్లిక్ డొమైన్‌లను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించవు. వారికి ప్రత్యేకంగా సొంత డొమైన్ ఉంటుంది.

నిజమైనది ఈ-మెయిల్ : no-reply@amazon.in

నకిలీ : amazon.customersupport@gmail.com

డొమైన్‌లో మార్పులు : డొమైన్ పేరులో అదనంగా అక్షరాలు, సంఖ్యలు లేదా పదాలను చేర్చుతారు.

నిజమైనది : info@icicibank.com

నకిలీ : info@icicibank-alerts.com

2. అత్యవసరం లేదా భయపెట్టే ధోరణిని గమనించండి

మీ ఖాతా బ్లాక్ చేయబడింది, వెంటనే దానిపై స్పందించకపోతే మీ అకౌంట్ పూర్తిగా తొలగించబడుతుంది. మీరు లాటరీ గెలిచారు. ఇలాంటి సందేశాలు మిమ్మల్ని భయపెట్టి లేదా ఆశపెట్టి, ఆలోచించకుండా స్పందించేలా చేస్తాయి. నిజమైన కంపెనీలు సాధారణంగా ఇలాంటి మెసేజ్​లను పంపవు.

3. ఈ-మెయిల్‌లోని లాంగ్వేజ్​ను పరిశీలించండి

పెద్ద పెద్ద అధికారిక సంస్థలు పంపే ఈ-మెయిల్‌లలో గ్రామర్​ ఎర్రర్స్ లేదా స్పెల్లింగ్ తప్పులు దాదాపుగా ఉండవు. ఈ-మెయిల్‌లో భాష అస్పష్టంగా ఉన్నా లేదా తప్పులున్నా అది నకిలీ అని వెంటనే అనుమానించాలి.

4. సాధారణ సంబోధన

నిజమైన కంపెనీలు మిమ్మల్ని గౌరవంగా పేరుతో సంబోధిస్తాయి. ఉదా : Dear Suresh. ఇలా కాకుండా Dear Customer, Dear User, వంటి సాధారణ పదాలతో మెయిల్ మొదలైతే అది తప్పకుండా అనుమానాస్పదమే.

5. లింక్స్, అటాచ్‌మెంట్‌ల పట్ల చాలా అప్రమత్తత

మెయిల్‌లో ఉన్న లింక్‌పై క్లిక్ చేసే ముందు, మీ కంప్యూటర్‌లో అయితే మౌస్ కర్సర్‌ను ఆ లింక్‌పై క్లిక్ చేయకుండా ఉంచండి. బ్రౌజర్ దిగువన ఆ లింక్ అసలు చిరునామా కనిపిస్తుంది. అది అధికారిక వెబ్‌సైట్‌ కాకపోతే అస్సలు క్లిక్ చేయవద్దు.

అటాచ్‌మెంట్లు : మీకు తెలియని వారి నుంచి లేదా అనుమానాస్పదంగా ఉన్న మెయిల్ నుంచి వచ్చిన ఫైల్స్‌ను (ముఖ్యంగా .zip, .exe, .scr వంటివి) ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్‌లోడ్ చేయవద్దు. వాటిలో వైరస్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

6. వ్యక్తిగత సమాచారాన్ని అడగడం

బ్యాంక్ గానీ, ప్రభుత్వ సంస్థ గానీ, ఏ ఇతర అధికారిక వెబ్​సైట్లు వ్యక్తిగత పాస్‌వర్డ్, పిన్, ఓటీపీ, క్రెడిట్ కార్డ్ నంబర్ వంటి సున్నితమైన సమాచారాన్ని ఈమెయిల్ ద్వారా అడగరు. ఎవరైనా అడిగితే అది మోసపూరిత ఈ-మెయిల్​గానే గుర్తించాలి.

గోల్డెన్ రూల్ : అనుమానం వస్తే, స్పందించొద్దు. మీకు ఒక ఈ-మెయిల్ మీద చిన్న అనుమానం వచ్చినా, దానికి సమాధానం ఇవ్వకపోవడమే ఉత్తమం. అందులోని లింక్‌లపై క్లిక్ చేయొద్దు. గూగుల్‌లో ఆ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించి విషయం నిర్ధారించుకోవాలి. ఈ-మెయిల్‌లో ఇచ్చిన ఫోన్ నంబర్‌కు కాల్ చేయవద్దు.

సైబర్​ క్రైమ్​ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇప్లూ వీసీ

Cyber Crime: 'నేను మీటింగ్​లో ఉన్నా.. అమెజాన్​ గిఫ్ట్​కూపన్​ పంపండి'

Last Updated : July 6, 2025 at 7:57 AM IST