Accused Arrested in investment Fraud : ఆన్లైన్లో పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న నీరజ్ అనే వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దిల్లీకి చెందిన ప్రైవేట్ ఉద్యోగి అయిన నీరజ్‌పై దేశవ్యాప్తంగా 88 కేసులు నమోదై ఉండగా, తెలంగాణలోనే 7 కేసుల్లో అతడి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు నకిలీ బ్యాంకు ఖాతాలు సరఫరా చేయడంతో పాటు ఓటీపీలను కూడా ఆపరేట్ చేసేవాడని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది.
పెట్టబడి పెట్టి అధిక లాభాలు సంపాదించవచ్చని నమ్మబలికి : హైదరాబాద్‌కు చెందిన బాధితుడికి అతని స్నేహితుడు ఒక లింక్ పంపాడు. COSTA WELL GROWN అనే ఒక పెట్టుబడి అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని డబ్బు సంపాదించవచ్చని నమ్మబలికాడు. మొదటగా బాధితుడు ఆ అప్లికేషన్‌లో సూచించిన వేర్వేరు బ్యాంకు ఖాతాల్లో కొద్ది మొత్తంలో పెట్టుబడి పెట్టాడు. అందుకు ప్రతిగా అతనికి రోజువారీ కొంత లాభం చూపించారు. పెట్టుబడిదారుడి నమ్మకాన్ని చూరగొనడానికి, ఆ లాభాల మొత్తాన్ని వారి అప్లికేషన్ వాలెట్‌లోకి జమ చేస్తామని, దానిని వ్యక్తిగత బ్యాంకు ఖాతాలోకి విత్‌డ్రా చేసుకోవచ్చని నిందితులు బాధితుడికి చెప్పారు.
బాధితుతుడికి రూ.6కోట్ల కుచ్చుటోపీ : ప్రతి విత్‌డ్రాపై 6 శాతం పన్ను మినహాయింపు ఉంటుందని, ఆ తర్వాత 1 నుంచి 3 రోజుల్లో ఆ మొత్తం బాధితుడి ఖాతాలో జమ అవుతుందని నమ్మించారు. దీంతో బాధితుడు 6 లక్షలు పెట్టుబడి పెట్టాడు. అయితే కొంతకాలమైన తర్వాత నిందితులు విత్‌డ్రా ప్రక్రియను పూర్తిగా నిలిపివేశారు. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడుని అరెస్టు చేశారు.
నిందితుడి వద్ద నుంచి ఒక ల్యాప్‌టాప్, 6 మొబైల్ ఫోన్‌లు, 3 బ్యాంక్ పాస్‌బుక్‌లు, 6 బ్యాంక్ డెబిట్ కార్డులు, 26 చెక్ పుస్తకాలు, 8 సిమ్ కార్డులు, 5 రబ్బరు స్టాంపులు, 2 ఓటీపీ డిటెక్టర్లు మరియు 2 యూపీఐ క్యూఆర్ కోడ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
లక్ష డిపాజిట్ చేస్తే రోజుకు రూ.2వేలు - ప్రజల నుంచి రూ.14కోట్లు స్వాహా
హైదరాబాద్ కేంద్రంగా మరో భారీ మోసం - రూ.850 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు