Cyanide in Ice Cream: అప్పుల భారం, ఆర్థిక ఇబ్బందులు ఓ బంగారు ఆభరణాల తయారీ వ్యాపారి ప్రాణాలు తీశాయి. సైనైడ్ కలిపిన ఐస్‌క్రీంను తాను తినడమేకాక అభం శుభం తెలియని ఏడేళ్ల కుమారుడికి సైతం ఇచ్చారు. దీంతో ఇద్దరూ నిమిషాల వ్యవధిలో తీవ్ర అస్వస్థతకు గురవడంతో పాటు అచేతన స్థితిలోకి వెళ్లిపోయారు. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.
కృష్ణా జిల్లా యనమలకుదురులో తండ్రీకుమారుల మృతితో కుటుంబ సభ్యులు శోకంలో మునిగిపోయారు. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధతో సైనైడ్ తాగి బలవన్మరణం చెందారు. తొలుత ఐస్‌క్రీమ్‌లో సైనైడ్ కలిపి ఇవ్వడంతో అది తిని కుమారుడు మృతిచెందాడు. అదే విధంగా తాను కూడా తిన్నారు. తామిద్దరమూ సైనైడ్ తీసుకున్నామని మెసేజ్ పెట్టడంతో విషయం బయటకు వచ్చింది.
వేమిరెడ్డి సాయిప్రకాశ్‌రెడ్డి (33), భార్య లక్ష్మీభవాని యనమలకుదురులోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. వీరికి కుమార్తె తక్షిత, కుమారుడు తక్షిత్ ఉన్నారు. సాయిప్రకాశ్‌రెడ్డి పాతబస్తీలో బంగారు ఆభరణాల తయారీ వ్యాపారం చేస్తుంటారు. భార్య మందుల దుకాణంలో పని చేస్తున్నారు. కరోనా సమయంలో వ్యాపారం సరిగ్గా సాగకపోవడంతో ఆర్థికంగా నష్టపోయారు. అప్పులపాలు కావడంతో కుటుంబసభ్యులు కొంత మేర ఆదుకున్నారు.
అయినా అప్పుల ఊబి నుంచి బయటపడలేక సాయిప్రకాశ్‌రెడ్డి కొంతకాలంగా తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నట్లు తెలిసింది. భార్య ధైర్యం చెబుతున్నా ఇతనిలో ఆందోళన తగ్గలేదు. భార్య లక్ష్మీభవాని మందుల దుకాణానికి వెళ్లిన సమయంమలో సాయిప్రకాశ్‌రెడ్డి తాను సైనైడ్ తిని, కుమారుడికి ఐస్‌క్రీమ్‌లో సైనైడ్ కలిపి తినిపించారు. ఇద్దరూ నిమిషాల వ్యవధిలో తీవ్ర అస్వస్థతకు గురై, అచేతన స్థితిలోకి వెళ్లిపోయారు. ఇద్దరినీ స్థానికుల సహాయంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. కాసేపటికే ఇద్దరూ మృతిచెందారు.

సారీ బావా అంటూ మెసేజ్ పెట్టి: సాయిప్రకాష్‌రెడ్డి తన సన్నిహితుడైన విజయ్‌కు ‘సారీ బావా నేను, తక్షిత్ సైనైడ్ తీసుకున్నాం’ అని మెసేజ్ పెట్టారు. దీంతో సాయిప్రకాష్‌రెడ్డి ఐస్‌క్రీంలో సైనైడ్ కలిపి తిన్నట్టు గుర్తించారు. ముద్దులొలికే ఏడేళ్ల కుమారుడిని సైతం తనతో తీసుకెళ్లడం స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు శోకంలో మునిగిపోయారు.
మారతాడని ఎంతో ఎదురుచూశా - కానీ ఫలితం లేదు
పిల్లలు పోటీ పడలేక పోతున్నారని - కాళ్లూ చేతులూ కట్టేసి, తలలు బకెట్లలో ముంచేసి!