Crop Damage Due to Sudden Rains In Prakasam District : ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. బేస్తవారిపేట, కొమరోలు మండలాలలో అరటి, సజ్జ, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. అప్పులు చేసి మరి పెట్టుబడి పెట్టామని అకాల వర్షాలతో ఆర్థికంగా పూర్తిగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
కొమరోలు మండలం ఇడమకల్లు, మదవ పల్లి గ్రామాలలో పిడుగు పడి మూడు గేదెలు మృతి చెందాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. అకాల వర్షాలతో రైతన్నలు తీవ్ర నష్టాల పాలయ్యారు. గురువారం మధ్యాహ్నం నుంచి తెల్లవారుజామున వరకు కురిసిన వర్షాలకు రైతన్నలు ఆర్థికంగా నష్టపోయారు.
'గురువారం కురిసిన వర్షాలతో మా గ్రామంలో అరటి తోటలు పూర్తిగా నేలమట్టమై పోయాయి. ఎకరాకు రూ.1,50,000 పెట్టుబడి పెట్టగా, సజ్జకు రూ.50 వేలు, మొక్కజొన్నకు ఎకరా రూ.40 వేలు అప్పుచేసి మరి పెట్టుబడి పెట్టాము. అకాల వర్షాలతో ఆర్థికంగా పూర్తిగా నష్టపోయాం. నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి. బలమైన ఈదురు గాలుల వల్ల నియోజకవర్గంలో దాదాపు 10 గంటలకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.' -బాధిత రైతులు