CRDA Invites Tenders for Secretariat Towers Construction: రాజధాని అమరావతిలో శాసనసభ, హైకోర్టు, సచివాలయం పనులు ప్రారంభించేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సచివాలయ టవర్ల నిర్మాణం కోసం సీఆర్డీఏ టెండర్లను ఆహ్వానించింది. సచివాలయం కోసం నాలుగు టవర్లు, హెచ్ఓడీ కార్యాలయాల కోసం మరో టవర్ నిర్మాణం కోసం టెండర్లను జారీ చేసింది. హెచ్ఓడీ టవర్ నిర్మాణం కోసం రూ. 1126 కోట్లకు టెండర్ పిలిచింది.
సచివాలయం 1- 2 టవర్ల కోసం రూ.1897 కోట్లతో మరో టెండర్, సచివాలయం టవర్ 3,4 కోసం రూ.1,664 కోట్లతో టెండర్ల జారీ చేసింది. మొత్తం 5 టవర్లను రూ. 4,668 కోట్లతో వ్యయంతో చేపట్టాలని నిర్ణయించింది. మే 1 తేదీన సచివాలయం, హెచ్‌వోడీ టవర్ల నిర్మాణానికి టెక్నికల్ బిడ్లు తెరవనుంది. ప్రస్తుతం సచివాలయంలో సీసీటీవీ వ్యవస్థతో పాటు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు, నిర్వహణ కోసం సైతం సీఆర్డీఏ టెండర్లు పిలిచింది.
అమరావతి నిర్మాణానికి వివిధ రూపాల్లో నిధులు - సీఆర్డీయే అథారిటీ సమావేశంలో నిర్ణయం
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల అభివృద్ధికి సీఆర్డీఏ ప్రణాళిక