Couple Get Junior Lecturer Jobs : నేటితరం ప్రేమ పేరుతో మనసు పారేసుకుని పుస్తకాలను దూరం పెట్టేస్తున్నారు. భవిష్యత్ లక్ష్యాలను పక్కన పెట్టి బంగారు లాంటి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కొన్నిసార్లు ప్రేమ శృతి మించడంతో హత్యలు, ఆత్మహత్యలూ జరుగుతున్నాయి. వాళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డా రు. వివాహం చేసుకుందామని నిశ్చయింకున్నారు. కానీ, సర్కారీ ఉద్యోగం సాధించాలనే లక్ష్యాన్ని మాత్రం మరువలేదు. కృత నిశ్చయంతో ఒకరు 4, మరొకరు 2 ప్రభుత్వ కొలువులు సాధించిపెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు మెదక్ జిల్లాకు చెందిన నవీన్, పద్మ.
ఈ యువ జంట మాత్రం ప్రేమించి, ఉన్నత లక్ష్యాలను సాధించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుని యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇద్దరూ ఒకే సబ్జెక్ట్‌లో జూనియర్ లెక్చలర్‌గా కొలువులు సాధించారు. కడు పేదరికం నుంచి వచ్చిన ఈ యువత కష్టపడి ఎటువంటి కోచింగ్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఒక్కటయ్యారు. ఇద్దరూ ఉద్యోగస్తులు కావడంతో పెద్దలు కూడా అడ్డు చెప్పలేకపోయారు. నెల రోజుల క్రితం పెద్దల సమక్షంలో వివాహం చేసుకుని యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. రానున్న రోజుల్లో యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లుగా కొలువులు సాధిస్తామని అంటున్నారు ఈ యువ జంట నవీన్, పద్మ.
"నేను పని చేస్తూనే చదువుకున్నాను. అందుకే నాకు కష్టం విలువ తెలిసింది. ఎస్జీటీ, గురుకుల డిగ్రీ లెక్చరర్, గ్రూప్ 4లో మెరిట్ సాధించాను. కానీ నేను వాటిల్లో జాయిన్ కాలేదు. జూనియర్ లెక్చరర్ ఫలితాల్లో 2వ ర్యాంక్ వచ్చింది. నేను చదువుకున్న కాలేజీలో మొదటి పోస్టింగ్ తీసుకున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లుగా జాబ్ సాధించాలి."- నవీన్, జూనియర్ లెక్చరర్
"నేను యూట్యూబ్ నాకు చాలా ఉపయోగపడింది. అందులోనే కరెంట్ అఫైర్ క్లాసులు వినేదాన్ని. గురుకుల డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ ఎంపిక అయ్యాను. ఈ రెండు జాబ్‌లు సాధించడంతో మా భర్త, మా కుటుంబం ప్రోత్సాహం సపోర్ట్ ఎంతో ఉంది. రానున్న రోజుల్లో యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లుగా జాబ్ సాధించాలి."- పద్మ, జూనియర్ లెక్చరర్
యాభై సార్లు రక్తం ఎక్కించుకుని - ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతి
YUVA : మూడేళ్ల ప్లానింగ్, రోజుకు 10 గంటల ప్రిపరేషన్ - చివరకు నెరవేరిన లక్ష్యం