Visakha Government Womens College Facilities : సువిశాల మైదానం, పచ్చటి చెట్లు, నగరం నడి మధ్య ద్వారకా బస్ కాంప్లెక్స్‌కు కూతవేటు దూరంలో విశాఖ ప్రభుత్వ మహిళా కళాశాల ఉంది. న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్‌తో, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కళాశాలగా గుర్తింపు తెచ్చుకుంది. ఇంటర్, డిగ్రీ కోర్సులతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. పీహెచ్డీ చేసేందుకు మహిళా కళాశాల అవకాశం కల్పిస్తోంది. అంతేకాకుండా స్మార్ట్ బోర్డు, డిజిటల్ క్లాస్ రూమ్ సౌకర్యం ఉంది. పెద్ద ప్రాక్టికల్ హాల్ ఇక్కడ ప్రత్యేకత. డిజిటల్ లైబ్రరీ, వందలాది పుస్తకాలతో గ్రంథాలయంతోపాటు అదనపు సౌకర్యాలు ఉన్నాయి.
'మా కళాశాలలో విద్యార్థులకు ఉపాధిలో సదావకాశాలు కల్పిస్తున్నాం. విశాఖ మహిళలకు అందుబాటులో విద్యను అందిస్తూ, రక్షణ కల్పిస్తున్నాం. అన్ని సౌకర్యాలతో కార్పొరేట్ సంస్థను తలపించేలా అధునాతన సదుపాయాలు కల్పిస్తున్నాం. కేవలం చదువే కాకుండా శారీక ధారుఢ్యం, క్రీడలు, సైన్స్, టెక్నాలజీ వంటి ప్రతీ అంశాన్ని విద్యార్థులకు చేరువయ్యేలా చేస్తున్నాం.' -డా.రోణంకి మంజుల, ప్రిన్సిపల్
Corporate Facilities in Visakha Govt Womens College : విద్యార్థుల మానసిక, శారీరక దారుఢ్యం కోసం ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్ ఉంది. ఇండోర్, ఔట్ డోర్ గేమ్స్, జిమ్ సౌకర్యంతోపాటు... జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనేందుకు తగిన శిక్షణ ఇక్కడ అందిస్తారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం నైపుణ్య శిక్షణ, కెరీర్ గైడెన్స్ వంటి ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. విద్యార్థులు గ్రూప్-1, సివిల్స్‌లో విజయం సాధించేందుకు అధ్యాపకులు అన్నివిధాలా సహకరిస్తున్నారు. కేవలం విద్యా కోర్సులు మాత్రమే కాకుండా ఎన్సీసీ (NCC), ఎన్.ఎస్.ఎస్. (NSS) విభాగం ద్వారా ఈ కళాశాల విద్యార్థులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. తమ కళాశాలలో చదివి గొప్ప అవకాశాలు అందిపుచ్చుకున్నామనే దృక్పథం విద్యార్థినులకు అందించాలనేదే తమ ముఖ్య లక్ష్యమని అధ్యాపకులు చెబుతున్నారు.
ప్రభుత్వ మహిళా కళాశాలలో చదవటం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. ఉద్యోగం సాధించి కాలేజీ నుంచి బయటికి వెళ్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
దివ్యాంగులకు అండగా విద్యార్థులు - కొత్త టెక్నాలజీతో ఎన్నో సమస్యలకు పరిష్కారాలు