ETV Bharat / state

ఆగని వెఎస్సార్​సీపీ నేతల వేధింపులు - కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం - YSRCP Leaders Harassment

Constable Attempted Suicide Due to YSRCP Leader Harassment: అధికారంలో ఉన్నా లేకపోయినా వైఎస్సార్​సీపీ నేతల వేధింపులకు అడ్డుకట్ట పడట్లేదు. సామాన్యల నుంచి అధికారుల వరకూ ఎందరూ వారి బాధితులే. తాజాగా నెల్లూరు జిల్లాలో వైఎస్సార్​సీపీ నేత వేధింపులతో ఓ కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. కాగా అతని పరిస్థితి విషమంగా ఉంది.

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 17, 2024, 10:31 PM IST

ysrcp_leaders_harassment
ysrcp_leaders_harassment (ETV Bharat)

Constable Attempted Suicide Due to YSRCP Leader Harassment: సామాన్య ప్రజలకు సమస్యలుంటే పోలీసులకు చెప్పుకుంటారు. మరి పోలీసులకే కష్టమొస్తే ఎవరికి చెప్పుకుంటారు. అది కూడా పైఅధికారుల నుంచో లేక రాజకీయ నేతల నుంచో వస్తే ఆ బాధ ఎవరితో పంచుకోవాలి, ఎలా చెప్పుకోవాలి. ధైర్యం ఉన్నవాళ్లు బదిలీ చేయించుకుని వెళ్లిపోవడమో, లేదా సెలవు పెట్టడమో చేస్తుంటారు. ధైర్యం లేనివారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

రాష్ట్రంలో గత వైఎస్సార్​సీపీ హయాంలో అధినేత జగన్ అండతో పెద్ద పెద్ద నాయకుల నుంచి కింది స్థాయి నాయకుల వరకు ఇష్టానుసారంగా సామాన్యులను వేధించేవారు. తమకు వ్యతిరేకంగా ఉంటే అది ఎలాంటి వారైనా సరే వారికి వేధింపులు, అక్రమ కేసులు తప్పవు. ఇలా జగన్ ఐదేళ్ల పాలనలో ఇలాంటి ఘటనలు ఎన్నో చూశాం. ఇటీవల ముంబయి నటి విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. వారికి కావాల్సిందల్లా ఎదుటి వారిని ఇబ్బంది పెట్టి వారి దారిలోకి తెచ్చుకోవడమే. వారి ఇబ్బందులు తట్టుకోలేక ఎంతో మంది సామాన్యులు, ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు.

సినీనటిపై వేధింపులు అప్డేట్ - ముంబయిలో కేసు క్లోజ్ కోసం బెజవాడలో సెటిల్‌మెంట్‌ - YSRCP Leaders Harassed Actress

వైఎస్సార్​సీపీ నాయకులు పెడుతున్న ఇబ్బందుల గురించి ఎవరికి చెప్పినా పట్టించుకోకపొవడంతో చాలా కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నాయి. వారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అరాచకాలు చేశారు. కానీ అధికారం పోయినా సరే వారి వేధింపులు మాత్రం ఎక్కడికక్కడ కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలానే వైఎస్సార్​సీపీ నేత వేధింపులతో ఓ కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే

అప్పు తీర్చలేక: నెల్లూరు జిల్లా సంగం మండలం పడమటిపాలెంలో వైఎస్సార్​సీపీ నేత వేధింపులతో కానిస్టేబుల్‌ రమేశ్ అనే వ్యక్తి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. పడమటిపాలెంలో వైఎస్సార్​సీపీ జడ్పీటీసీ భర్త ప్రసాద్‌గౌడ్ అనే వ్యక్తి దగ్గర పంట వేసుకునేందుకు అప్పు తీసుకున్నారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపోవడంతో అప్పు తీర్చలేకపోయారు. ఈ క్రమంలో అప్పు తీర్చకపోవడంతో రమేశ్‌ను ప్రసాద్‌గౌడ్ ఇబ్బందులకు గురి చేశారు. ప్రసాద్‌గౌడ్‌ వేధింపులు తాళలేక కానిస్టేబుల్ రమేశ్‌ లేఖ రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం కానిస్టేబుల్‌ పరిస్థితి విషమంగా ఉంది. కాగా రమేశ్​ను నెల్లూరు అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

'ఇదేంటని ప్రశ్నిస్తే అంతే సంగతులు - ఉత్తమ ఉద్యోగి అయినా డిమోషన్లు తప్పవు' - Harassment of Superiors in Kurnool

వైఎస్సార్సీపీకి ఓటు వేయాలని వేధింపులు - ఆలస్యంగా వెలుగులోకి ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ ఆగడాలు - Harassment to vote for YSRCP

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.