Orders for Acquisition of Encroached Forest Lands in Sajjala Estate : వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలోని వైఎస్సార్సీపీ నేత, గత ప్రభుత్వంలో సలహారు సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల ఎస్టేట్‌లో ఆక్రమిత అటవీ భూములపై జిల్లా కలెక్టర్ శ్రీధర్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. సర్వే నంబరు 1,629లో 11 వేల ఎకరాల అటవీ భూమి ఉంది. అందులో 63 ఎకరాలను సజ్జల కుటుంబ సభ్యులు ఆక్రమించారన్నది ప్రధాన అభియోగం.
దీనిపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు సజ్జల ఎస్టేట్‌కు చెందిన 184 ఎకరాల్లో 63 ఎకరాల ఆక్రమిత భూమి ఉందని నిర్ధరించారు. ఇందులో 52 ఎకరాల అటవీ భూమి కూడా ఉంది. దీనిపై ఇప్పటికే కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. సీకే దిన్నె తహశీల్దార్ ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకున్నారు. 63 ఎకరాలకు రెవెన్యూ సిబ్బంది హద్దులు పాతి, బోర్డులు పెట్టారు. ఇందులో 52 ఎకరాల అటవీ భూమిని ఆ శాఖకు అప్పగించనున్నారు.
సజ్జల ఎస్టేట్‌లో 64 ఎకరాల అటవీ భూమి- జిల్లా కలెక్టర్ నివేదిక