ETV Bharat / state

తెలంగాణలో ఎక్కడా లేని పంట నల్గొండకే ప్రత్యేకం - అదేంటో తెలుసుకోండి! - MAKHANA CROP IN NALGONDA

రైతులకు మఖానా పంటను పరిచయం చేసిన కలెక్టర్‌ ఇలా త్రిపాఠి - రైతులను లాభాల బాటలో నడిపించేలా ప్రత్యేక చర్యలు - మఖానా పంటకు మార్కెట్​లో మంచి డిమాండ్​ ఉందంటున్న అధికారులు

Makhana Nuts
Makhana Crop in Nalgonda (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 19, 2025 at 8:19 PM IST

2 Min Read

Makhana Crop in Nalgonda District : రైతులను లాభాల బాటలో నడిపించాలనే ఉద్దేశంతో నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకూ ఎక్కడా లేని మఖానా పంటను జిల్లా రైతులకు పరిచయం చేశారు. కంపసాగర్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ప్రయోగాత్మక మఖానా పంట సాగును ప్రారంభించారు. ఈ మఖానా పంట అంటే ఏంటి? దీని వలన ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?. పెట్టుబడి, దిగుబడి, పంట సాగు చేసే విధానంపై ప్రత్యేక కథనం.

నల్గొండ జిల్లా వ్యవసాయం చేయడానికి చాలా అనుకూలమైన ప్రాంతం. అందుకే ఇక్కడ వరి, పత్తి పంటలు సమృద్ధిగా పండుతాయి. ఇవేకాకుండా వేరుశనగ, మొక్కజొన్న, బత్తాయి, నిమ్మ, మామిడి వంటి పంటల దిగుబడి బాగానే వస్తోంది. రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా పంట మార్పిడి దిశగా అడుగులు వేస్తే లాభసాటిగా ఉంటుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి మఖానా పంటను పరిచయం చేశారు. ఫైబర్‌, పోషకాలు సుసంపన్నంగా ఉండే మఖానా మనిషిని ఆరోగ్యంగా ఉంచటంలో తోడ్పాటునందిస్తుంది.

మఖానా సాగు గురించి : మనిషికి కావాల్సిన అన్ని రకాల పోషకాలుండే మఖానాకు అంతర్జాతీయ మార్కెట్లలో పెరుగుతున్న డిమాండ్‌ దృష్ట్యా నల్గొండ జిల్లాలో సాగు చేసేలా కలెక్టర్‌ చర్యలు చేపట్టారు. మార్చినెలలో జిల్లా నుంచి వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులతో కూడిన బృందం బిహార్ రాష్ట్రంలోని దర్భంగకు వెళ్లి మఖానా సాగు, విత్తనం మొదలుకొని పంట కోత వరకు అన్ని విషయాలను అధ్యయనం చేసి వచ్చారు.

జిల్లాలోని రైతులకు వారి అనుభవాలను వివరించారు. జిల్లాలో మఖానా సాగులో భాగంగా ప్రయోగాత్మకంగా నల్గొండ జిల్లా త్రిపురారం మండలం కంపసాగర్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఒక ఎకరం విస్తీర్ణంలో మఖానా సాగు విత్తనాలను చల్లి ప్రయోగాత్మక సాగును ప్రారంభించారు. త్వరలోనే వివిధ ప్రాంతాల్లోనూ సాగు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

ప్రయోగాత్మకమైన సాగు : నల్గొండ జిల్లాను వ్యవసాయ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అన్ని అవకాశాలున్నాయన్న కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇక్కడి వాతావరణం, నీటి వసతులు, నూతన పంటల సాగును దృష్టిలో ఉంచుకుని మాఖానా సాగును ప్రారంభించినట్లు చెప్పారు. చాలా మందికి మఖానా సాగు బిహార్ వంటి ప్రాంతాలకే అనుకూలంగా ఉంటుందని నల్గొండ జిల్లాలో వాతావరణం అనుకూలంగా ఉంటుందా? లేదా? అని అనేక అపోహలు ఉన్నాయని వాటిన్నింటిని పక్కనపెట్టి నూతన పంటల సాగుపై చర్యలు తీసుకోవడంలో భాగంగా ముందడుగు వేశామన్నారు. ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఈ మఖానా పంట 60 శాతం దిగుబడి వచ్చినా ఇక్కడే మఖానా ప్రాసెసింగ్ యూనిట్‌ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

సత్ఫలితాలిస్తే విస్తరిస్తాం : మఖానాను ఫూల్ మఖానా, తామర గింజలు, ఫాక్స్ నట్స్ అని కూడా పిలుస్తారని జిల్లా ఉద్యానశాఖ అధికారి అనంతరెడ్డి తెలిపారు. మఖానా పంట సాగుకు ఎకరానికి 60 నుంచి 70 వేల రూపాయలు ఖర్చు పెడితే సుమారు 2 నుంచి 3 లక్షల ఆదాయం వస్తోందని చెబుతున్నారు. ఖర్చులు అన్ని పోనూ సుమారు 2 లక్షల వరకు మిగులుతుందన్నారు. మఖానా పంటకు మార్కెట్​లో మంచి డిమాండ్ ఉందని కట్టంగూరు రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు నంద్యాల నరసింహారెడ్డి తెలిపారు. జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ మఖానా సాగు సత్ఫలితాలు ఇస్తే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపజేయనున్నారు.

ప్రధాని మోదీ 300 రోజులూ తింటానన్న మఖానాతో - అద్దిరిపోయే గుంతపొంగనాలు చేసుకోండిలా!

నిర్మలమ్మ నోట 'మఖానా' మాట- ఇది తింటే షుగర్, బీపీ సమస్యలకు చెక్! ఎంత ఆరోగ్యమో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.