ETV Bharat / state

ఫలక్​నుమా సూపర్​ఫాస్ట్​ రైలు నుంచి విడిపోయిన 12 బోగీలు- శ్రీకాకుళం జిల్లాలో ఘటన - FALAKNUMA SUPERFAST IN SRIKAKULAM

రెండు గంటల నుంచి రైలు నిలిచిపోవడంతో ప్రయాణికుల అవస్థలు

coaches_detached_from_falaknuma_superfast
coaches_detached_from_falaknuma_superfast (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 8, 2025 at 10:15 AM IST

Updated : April 8, 2025 at 10:31 AM IST

1 Min Read

Coaches Detached from Falaknuma Superfast in Srikakulam District : శ్రీకాకుళం జిల్లాలో ఫలక్‌నుమా సూపర్‌ ఫాస్ట్‌ రైలుకు ప్రమాదం తప్పింది. పలాస మండలం సుమ్మాదేవి, మందస రైలు నిలయం మధ్యలో రైలు నుంచి 12 బోగీలు విడిపోయాయి. A1 ఏసీ కోచ్‌ దగ్గర కప్లింగ్‌ దెబ్బతినడంతో 12 బోగీలు విడిపోయాయి. వెంటనే రైలు అక్కడికక్కడే నిలిచిపోయింది. దీంతో ప్రమాదం తప్పింది. ఈ రైలు సికింద్రాబాద్‌ నుంచి హావ్‌డా వెళ్తుంది. సుమారు రెండు గంటల నుంచి రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. రైలు ఇంజన్‌ వైపు ఉన్న బోగీలను మందస రైల్వేస్టేషన్‌కు తీసుకెళ్లారు. బోగీలను జాయింట్‌ చేసిన తర్వాత రైలు హావ్‌డా బయల్దేరనుంది.

గుంటూరు టూ గుంతకల్లు - చివరి దశకు రైలు మార్గం డబ్లింగ్‌ పనులు

పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు - నిలిచిన రైళ్ల రాకపోకలు

Last Updated : April 8, 2025 at 10:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.