ETV Bharat / state

వర్షాకాలం సాగుపై సీఎం రేవంత్​ రెడ్డి సమీక్ష - నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక - CM REVANTH REVIEW ON RABI CROP

వర్షాకాలం సాగుపై సీఎం రేవంత్​ సమీక్ష - నకిలీ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచన - నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

CM Revanth Review Meeting on Rabi Crop
CM Revanth Review Meeting on Rabi Crop (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 17, 2025 at 12:38 AM IST

2 Min Read

CM Revanth Review Meeting on Rabi Crop : వానాకాలం పంట సాగుకు సన్నద్ధంగా ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా సాగు విస్తీర్ణానికి సరిపడేన్ని విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. నకిలీ విత్తనాలు, రైతులను మోసం చేసే కంపెనీలు వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి హెచ్చరించారు.

నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలని సీఎం అధికారులను ఆదేశించారు. కల్తీ, నకిలీ విత్తనాల దందాను అరికట్టేందుకు అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాల వారీగా వ్యవసాయ శాఖ, పోలీస్ విభాగం సంయుక్తంగా టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించాలని, రాష్ట్ర సరిహద్దులు అన్నిచోట్ల టాస్క్​ఫోర్స్​ నిఘా ఉంచాలని చెప్పారు. రైతులను మోసం చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను సీఎం హెచ్చరించారు. ఎవరెవరు కల్తీ విత్తనాలు విక్రయిస్తున్నారు, ఎక్కడ నిల్వలులున్నాయి, ఎక్కడ నుంచి రవాణా అవుతున్నాయనే వివరాలన్నీ అధికారులకు సమాచారం ఉందని, ఎవరినీ ఉపేక్షించకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు.

వర్షాకాలం సాగపై : నకిలీ దందా చేసే వ్యాపారులపై పీడీ యాక్ట్ కేసులు పెట్టాలన్నారు. విత్తనాలు, ఎరువులకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో మాట్లాడాలని సీఎస్ రామకృష్ణారావును సీఎం ఆదేశించారు. సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వానాకాలం పంటల సాగుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఇప్పటికే అన్ని జిల్లాల్లో సరిపడే విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సీజన్​లో వరి, పత్తి సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంటుందని, రైతుల నుంచి డిమాండ్ ఉన్న అన్ని కంపెనీల విత్తనాలు మార్కెట్లో ఉన్నాయని చెప్పారు. ఎరువులు, విత్తనాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రైతులకు భరోసానిచ్చారు.

నకిలీ విత్తనాలపై అవగాహన కల్పించాలి : ఈసారి రుతుపవనాలు ముందే వస్తుండటంతో, రాష్ట్రంలోనూ వానలు ముందుగానే కురిసే అవకాశముందని వాతావరణ శాఖ చేసిన సూచనలను రైతులు గమనించాలన్నారు. అందుకు అనుకూలంగా సరైన అదనులో పంటలు వేసుకోవాలని, నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని రైతులను అప్రమత్తం చేశారు. ప్యాక్​డ్​ విత్తనాలు తప్ప లూజ్ విత్తనాలు కొనుగోలు చేయొద్దని, విత్తన ప్యాకెట్లు కొనేటప్పుడు తప్పకుండా బిల్లును, పాకెట్​ను పంట కాలం ముగిసేంత వరకు భద్రపరుచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. నకిలీ కంపెనీలు, కల్తీ విత్తనాల బారిన పడి రైతులు మోసపోకుండా పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖకు ఆదేశించారు.

సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్​ రెడ్డి, ఎంపీ చామల కిరణ్​ కుమార్​రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపితో పాటు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Cabinet Approves Fertilisers Subsidy : రైతులకు శుభవార్త.. ఎరువులపై రూ.22,303 కోట్ల సబ్సిడీకి కేంద్ర కేబినెట్ ఆమోదం

రైతులకు శుభవార్త.. ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.