CM Revanth Reddy Stuck in Elevator : సీఎం రేవంత్ రెడ్డి నోవాటెల్‌లో జరుగుతున్న కాంగ్రెస్ సీఎల్పీ సమావేశానికి వెళ్తున్న క్రమంలో హోటల్ లిఫ్ట్‌లో సాంకేతిక సమస్య ఏర్పడింది. సీఎం అందులోనే ఉండటంతో అందరూ టెన్షన్ పడ్డారు. లిఫ్ట్ ఆగాల్సిన చోటుకంటే రెండు అడుగులు కిందకు దిగింది.
ఓవర్ వెయిట్ కారణంతోనే : 8 మంది ఎక్కాల్సిన లిఫ్ట్‌లో 13 మంది ఎక్కడంతో సమస్య వచ్చినట్లు హోటల్ సిబ్బంది తెలిపారు. లిఫ్ట్ డోర్లు వేయకముందే 2 అడుగుల మేర కిందకు జారడంతో వెంటనే సీఎం సెక్యూరిటీ, హోటల్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. లిఫ్ట్ ఓపెన్ చేసి సీఎంను సెకండ్ ఫ్లోర్‌కు పంపారు. తరువాత వేరే లిఫ్ట్‌లో ముఖ్యమంత్రిని తరలించారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
గీత దాటితే ఊరుకునేది లేదు - సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
భూ భారతితో వివాదాలు లేని భూములను రైతులకు కానుకగా ఇస్తాం : సీఎం రేవంత్ రెడ్డి