CM Chandrababu Review On Arrangements For Godavari Pushkaralu: కలెక్టర్ల సదస్సులో జోన్-2 జిల్లాలైన తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల కార్యాచరణ ప్రణాళికలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గోదావరి పుష్కరాల కోసం ఇప్పటి నుంచే ముందస్తు ఏర్పాట్ల పర్యవేక్షణకు ఇద్దరు ఐఎఎస్ అధికారులను నియమించారు. ప్రత్యేక అధికారిగా జీ.వీరపాండియన్, అదనపు ప్రత్యేక అధికారిగా విజయరామరాజు నియమిస్తున్నట్టు ప్రకటించారు. విశాఖ, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయవాడ, తిరుపతి, కర్నూలు నగరాల్లో కనీసం 5000 హోటల్ రూమ్‌లు అందుబాటులోకి వచ్చేలా కార్యాచరణ చేయాలని సీఎం సూచించారు.
ఆయా నగరాల్లో తగిన భూమిని గుర్తించి అందుబాటులో ఉంచితే హోటళ్ల ఏర్పాటుకు ముందుకు వచ్చే సంస్థలతో మాట్లాడదామని సీఎం అన్నారు. రాజమహేంద్రవరంలోని పాత హేవ్ లాక్ రైల్వే బ్రిడ్జి, పిచ్చుక లంక కడియం నర్సరీలు కలుపుతూ పర్యాటక సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. హేవ్ లాక్ బ్రిడ్జి పర్యాటక ప్రాజెక్టు అభివృద్ధికి రూ.12.50 కోట్లు చెల్లించినట్టు తెలిపారు. కేంద్రం నుంచి మరిన్ని నిధులు రాబట్టేలా ప్రయత్నించాలని సీఎం చంద్రబాబు తెలిపారు. దేశానికి అన్నపూర్ణగా నిలిచిన గోదావరి జిల్లాల్లో తలసరి ఆదాయం తగ్గుతోందని కలెక్టర్లు దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేశారు. కాకినాడ సముద్ర తీరంలోని 1246 ఎకరాల స్టార్ట్ భూములను కాలుష్య రహిత పరిశ్రమలకు రిజర్వు చేయాలన్నారు.
అన్ని జిల్లాల్లో అభివృద్ధి పరుగులు పెట్టాలి - కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశం
కలెక్టర్లు రొటీన్‌గా కాకుండా ప్రజల జీవనప్రమాణాలు పెంచేలా వినూత్నంగా ఆలోచించాలని సీఎం చంద్రబాబు సూచించారు. కోనసీమ జిల్లాలో అరటి, కొబ్బరి, కోకో, వరి గడ్డి తదితర ఉత్పత్తులకు విలువ జోడించాలన్నారు. వరిగడ్డితో బయోఫ్యూయల్ తయారీ యూనిట్లు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. ఆక్వా ఉత్పత్తులకు మరింత విలువ జోడించి ఆదాయం సాధించాలన్నారు. ఏపీ రైతులు ప్రోగ్రెసివ్ అని కోనియాడారు.
ఆక్వా రైతులు అందరూ రిజిస్ట్రేషన్ చేసుకుంటే యూనిట్ 1.50 చొప్పున విద్యుత్తు ఇస్తామని సీఎం హామి ఇచ్చారు. 100 శాతం సబ్సీడీతో మైక్రో న్యూట్రియెంట్స్ సరఫరా చేస్తామని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ రాదన్నారు. ఉప్పాడ సముద్ర కోత నివారణ పనులకు కేంద్రం నుంచి నిధులు సాధించాలని సీఎం చంద్రబాబు కోరారు.
'అర్థం చేసుకోవడానికి 30 ఏళ్లు పట్టింది' - కూనంనేని వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు
పాస్టర్ ప్రవీణ్‌కుమార్ మృతి - ఆందోళనకు దిగిన క్రైస్తవ సంఘాలు - విచారణకు సీఎం ఆదేశం