ETV Bharat / state

ఒంటిమిట్టలో శ్రీకోదండరాముడి కల్యాణం - పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు - CBN PRESENT CLOTHES TO ONTIMITTA

ఒంటిమిట్టలో వైభవంగా శ్రీకోదండరామస్వామి కల్యాణోత్సవం - స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు

CBN_present_clothes_to_Ontimitta
CBN_present_clothes_to_Ontimitta (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 11, 2025 at 9:48 PM IST

Updated : April 11, 2025 at 11:16 PM IST

2 Min Read

CM Chandrababu presents pattu clothes to Sri Kondandarama Swamy: రాష్ట్రంలో రామరాజ్యం తేవాలనేదే తన ఆకాంక్ష అని సీఎం చంద్రబాబు అన్నారు. శ్రీరాముడి స్ఫూర్తితో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ మేలు చేయడమే తన ధ్యేయమని అన్నారు. ఒంటిమిట్టలో శ్రీకోదండరామస్వామి కల్యాణోత్సవంలో సీఎం చంద్రబాబు దంపతులు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం అక్కడికి వచ్చిన భక్తులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు.

ఒంటిమిట్టలో జరపాలని ఆదేశాలు జారీ: ఒంటిమిట్టలో అత్యంత వైభవంగా సీతారాముల కల్యాణాన్ని జరుపుకొన్నామని వారిద్దరిదీ ఆదర్శ దాంపత్యమని సీఎం అన్నారు. పరిపాలన అంటే సాక్షాత్తూ శ్రీరాముడి పాలన గుర్తుకురావాలని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు భద్రాచలంలో రాములోరి దర్శనం చేసుకొనేవాళ్లమని అక్కడే వైభవంగా కల్యాణం జరిపేవాళ్లని అలాంటి సమయంలో విభజన జరిగిన తర్వాత మనం ఒంటిమిట్టలో అత్యంత వైభవంగా కోదండరాముడి కల్యాణాన్ని జరపాలని ప్రభుత్వపరంగా ఆదేశాలు జారీ చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు.

అప్పటినుంచి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చామని అభివృద్ధిలో భాగంగానే ఒంటిమిట్ట ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోకి తీసుకొచ్చినట్లు సీఎం తెలిపారు. ఈ ఆలయాన్ని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. టెంపుల్‌ టూరిజంలో భాగంగా ఒంటిమిట్ట ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఆలయం పక్కనే ఉన్న చెరువు బ్యూటిఫికేషన్‌ పనులను ప్రారంభించామని తెలిపారు.

అన్నదాతలకు గుడ్​న్యూస్​ - మే నెల నుంచి రూ.20 వేలు: సీఎం చంద్రబాబు

సంపదను భవిష్యత్‌ తరాలకు అందించాలి: ఇక్కడికి ఎవరు వచ్చినా రెండు మూడు రోజలు ఉండేలా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చంద్రబాబు తెలిపారు. దేవాలయాలు మన వారసత్వ సంపదదని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని సూచించారు. దేవాలయాలు లేకపోతే మన కుటుంబ వ్యవస్థ ఉండేది కాదని ప్రపంచంలో ఏ దేశానికీ లేని గొప్ప వారసత్వ సంపద భారతదేశానికి ఉందని స్పష్టం చేశారు. ఇలాంటి గొప్ప వారసత్వ సంపదను మన భవిష్యత్‌ తరాలకు అందించాలని సీఎం పిలుపునిచ్చారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 2047 నాటికి భారత్‌ నంబర్‌ 1 లేదా నంబర్‌ 2 దేశంగా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు తెలిపారు. తన ఆలోచన ఒక్కటేనని అలానే తన దృష్టిలో రామరాజ్యం అంటే రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుకోవడమేనని తెలిపారు. స్వర్ణాంధ్రప్రదేశ్‌లో పేదరికం అనేది ఉండకూడదని ఆర్థిక అసమానతలు కూడా తగ్గించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రజల సహకారంతో పేదరికం లేదని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతానని అని చంద్రబాబు పేర్కొన్నారు.

టీటీడీ గోశాలలో గోవులు మృతి చెందడం అవాస్తవం - ప్రజలు నమ్మొద్దు: టీటీడీ

ఒంటిమిట్ట కోదండరాముడికి స్వర్ణ కిరీటాలు - ఎంత విలువంటే!

Last Updated : April 11, 2025 at 11:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.