CM Chandrababu Participate P4 Program in Aagiripalli: రాష్ట్రంలో ఏ ఒక్కరూ పేదరికంలో ఉండకూడదనే కృతనిశ్చయంతో పనిచేస్తున్న ప్రభుత్వం ఇందులో భాగంగానే పీ4 అనే కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా అమలుచేస్తోంది. రాష్ట్రంలో బంగారు కుటుంబాలను ఎంపిక చేసి పేదరికంలో ఉన్న వీరందరినీ ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను మార్గదర్శకులకు అప్పగిస్తోంది. పీ4 పట్ల ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు బంగారు కుటుంబాల ఎంపిక, వారిని మార్గదర్శకులతో అనుసంధానం చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఏలూరు జిల్లాలోని ఆగిరిపల్లిలో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టనుంది.
కులవృత్తుల వారిని కలుసుకోనున్న సీఎం: ఏ కార్యక్రమం నిర్వహించినా పేదలను నేరుగా కలుసుకని వారి సాధక బాధకాలను తెలుసుకుంటున్న సీఎం చంద్రబాబు ఆగిరిపల్లి వేదికగా నిర్వహించే పీ4 కార్యక్రమంలో పలువురు కులవృత్తుల వారిని కలుసుకోనున్నారు. వారిని నేరుగా వారి పని ప్రదేశాల్లోనే కలుసుకుని వారి సమస్యలు తెలుసుకోనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
పెట్టుబడుల సాధన ఫలితాలు క్షేత్రస్థాయిలో కనిపించాలి : సీఎం చంద్రబాబు
నాయీ బ్రాహ్మణ, చాకలి, గొర్రెల కాపరులు, కళ్లుగీత వీరిలో ఇద్దరు లేదా ముగ్గురు కులవృత్తుల వారిని కలిసే అవకాశం ఉన్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి వివరించారు. సీఎం పర్యటన సందర్భంగా సభా ప్రాంతాన్ని జిల్లా జేసీ థాత్రిరెడ్డి, ఎస్పీ ప్రతాప్ శివకిశోర్తో కలిసి మంత్రి పరిశీలించారు. భద్రతా పరంగా ఎలాంటి సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు: ముందుగా ఆగిరిపల్లి మండలం వడ్లమాను ప్రాంతంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ చేరుకోనున్న సీఎం అక్కడి రోడ్డు మార్గం ద్వారా ఆగిరిపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక వద్దకు చేరుకుంటారు. అక్కడ పలువరు కులవృత్తుల వారిని కలిసి, వారికి మేలు చేకూరే కార్యక్రమాలను తెలియజేసిన అనంతరం ప్రజావేదికలో పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకోనున్నారు. అనంతరం పార్టీ కార్యకర్తలు, ముఖ్యనాయకులతో ఏర్పాటు చేసిన కార్యక్ర మంలో పాల్గొనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా పోలీసులు అధికారులు పటిష్ఠ భద్రతా ఏర్పాటు చేశారు.
‘జీరో పావర్టీ-పీ4’ కార్యక్రమం - సీఎం ఛైర్మన్గా సొసైటీ ఏర్పాటు
P4కు అనూహ్య స్పందన - కొమ్మమూరు ఎత్తిపోతల నిర్మాణానికి ముందుకొచ్చిన ప్రసాద్ సీడ్స్