ETV Bharat / state

ఏపీ ప్రజలకు గుడ్​ న్యూస్! - "నెరవేరనున్న పేదల సొంతింటి కల" - TIDCO HOUSES IN AP

దాదాపు 5లక్షల ఇళ్లకు అనుతులు ఇచ్చిన గత టీడీపీ ప్రభుత్వం - తాజాగా ఆదేశాలు

tidco_house_works
tidco_house_works (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 13, 2025 at 4:06 PM IST

3 Min Read

Tidco House Works : తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేపట్టిన టిడ్కో ఇళ్లను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న 1.18 లక్షల ఇళ్లను జూన్‌ 12 నాటికి పూర్తి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు గడువు నిర్దేశించారు. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి ఏడాది కానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

"రోజూ 15సిగరెట్లు, 6 పెగ్గులు ఎంత ప్రమాదమో వారికీ అంతే ప్రమాదం!" - హెచ్చరిస్తున్న పరిశోధనలు

ఐదు లక్షల ఇళ్లకు అనుమతులు

గృహ సముదాయాల్లో అన్నిరకాల మౌలిక సదుపాయాలు కల్పించి, గృహ ప్రవేశాలకు ఏర్పాట్లు చేయాలని సీఎం గతంలోనే ఆదేశించారు. ‘పేదలకు మంచి ఇళ్లు కట్టించి ఇవ్వాలని సదుద్దేశంతో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ఇతర దేశాల్లోనూ పలు నమూనాలు పరిశీలించి 2014-19 మధ్య టిడ్కో ఇళ్లను ప్రారంభించింది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఏపీకి 7,01,481 గృహాలు మంజూరు చేయగా రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల ఇళ్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది.

tidco_house_works
tidco_house_works (ETV Bharat)

ప్రభుత్వం మారడంతో

4,54,706 ఇళ్లకు టెండర్లు పిలిచి, 300, 365, 430 చ.అడుగుల విస్తీర్ణం చొప్పున విభజించి, 3,13,832 ఇళ్ల పనుల్ని ప్రారంభించింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్రం తన వాటాగా రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు అందించగా మౌలిక సదుపాయాల కల్పనకు ఒక్కో ఇంటికి రూ.90 వేల చొప్పున ఖర్చు చేశారు. మొత్తం రూ.38 వేల కోట్లతో 7,01,481 గృహాల్ని పూర్తిచేసేలా అప్పట్లో ప్రణాళిక రూపొందించగా ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ప్రభుత్వం మారిపోయి వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చంది. టీడీపీ చేపట్టిన ఇళ్లను గాలికొదిలేసిన నూతన ప్రభుత్వం పూర్తయిన ఇళ్లకు మాత్రం పార్టీ రంగులు వేసింది. దాదాపు 2.16 లక్షల గృహాలు మినహా మిగతావన్నీ రద్దు చేసి పేదల సొంతింటి కలపై నీళ్లు చల్లింది.

కమిషనర్లకు ఆదేశాలు

తాజాగా కూటమి ప్రభుత్వం టిడ్కో ఇళ్ల విషయమై ప్రత్యేక దృష్టి సారించింది. బ్యాంకర్ల నోటీసుల నేపథ్యంలో లబ్ధిదారుల ఆవేదనను గుర్తించిన ప్రభుత్వం వెంటనే నిధుల విడుదలకు ఆదేశించింది. పెండింగ్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయడంతో మున్సిపల్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు.

లబ్ధిదారుల పేరిట రుణాలు - ఇతరాలకు మళ్లింపు

జగన్ ప్రభుత్వం చేపట్టిన 2.16 లక్షల గృహాల్లో 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే 77 వేల గృహాల్ని దాదాపు పూర్తిచేశామని మంత్రి నారాయణ వెల్లడించారు. మరో 64 వేల ఇళ్లు 50 - 75శాతం మేర పూర్తికాగా, ఇంకో 49 వేల గృహాలు 25 - 50శాతం వరకు, 1.20 లక్షల ఇళ్లు 25శాతం లోపు నిర్మాణ దశలో ఉన్నాయని మంత్రి వివరించారు. గత ఐదేళ్లలో నిర్మాణాలన్నీ పూర్తయ్యే అవకాశం ఉన్నా వైఎస్సార్సీపీ ప్రభుత్వం విస్మరించిందని చెప్పారు. నిర్మాణాలు పునఃప్రారంభించాలంటే రూ.7,517 కోట్లు అవసరమని, పైగా జగన్ ప్రభుత్వం లబ్ధిదారుల పేరిట రుణాలు తీసుకొని ఇతర అవసరాలకు మళ్లించిందని పేర్కొన్నారు. రుణ మారిటోరియం గడువు పూర్తి కావడంతో బ్యాంకులు వాయిదాలు చెల్లించాలని లబ్ధిదారులపై ఒత్తిడి చేస్తున్నాయని, పేదల బ్యాంకు ఖాతాలు ఎన్‌పీఏలుగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. తాజా పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించడంతో పేదల బ్యాంకు ఖాతాలు ఎన్‌పీఏ కాకుండా రూ.102 కోట్ల విడుదలకు అంగీకరించారని వెల్లడించారు.

"ఫ్లోర్ క్లీనింగ్ నీళ్లలో ఇవి కలిపి చూడండి! - చీమలు, బొద్దింకలు పారిపోతాయి - ఇల్లంతా సువాసన

ఎక్కువ దూరం నడవాల్సిన అవసరమే లేదు! - "సిద్ధ నడక" స్టెప్ ఫాలో అయితే చాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.