CM Chandrababu Lay Foundation Stone for his House: ప్రజారాజధాని అమరావతిలో సొంతింటి నిర్మాణానికి సీఎం చంద్రబాబు రేపు (ఏప్రిల్ 9) శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 8:51 గంటలకు సీఎం కుటుంబసభ్యులు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. వెలగపూడిలోని సచివాలయం వెనక E9 రహదారి పక్కనే సీఎం చంద్రబాబు ఇంటి నిర్మాణం జరుగనుంది.
సీఎం చంద్రబాబు కుటుంబానికి వెలగపూడి గ్రామస్థులు పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. రాజధానిలో సొంతింటి నిర్మాణం కోసం చంద్రబాబు కుటుంబం రైతుల నుంచి 5 ఎకరాలు కొనుగోలు చేశారు. ఈ క్రమంలో శంకుస్థాపన కార్యక్రమానికి ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి.
దాదీ రతన్ మోహినీ జీ మృతిపై దిగ్భ్రాంతి: బ్రహ్మ కుమారీస్ గ్లోబల్ సెంటర్ల చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్‌గా సేవలందించిన రాజయోగిని దాదీ రతన్ మోహినీ జీ మృతి విచారకరమని సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 140కి పైగా దేశాల్లో భారతీయ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని చాటి సమాజానికి శాంతి, మానవతా విలువల సందేశాన్ని మోహిని జీ అందించారని కొనియడారు. ఆమె మరణం భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచానికి తీరని లోటని వ్యాఖ్యానించారు. వ్యక్తిగతంగా కూడా తనకు ఇది ఎంతో బాధాకరమని అన్నారు. దాదీ రతన్ మోహినీ జీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్ధిస్తున్నానని సీఎం చంద్రబాబు తెలిపారు.
'మీకు ఏం సౌకర్యాలు కావాలో అడగండి' - విద్యార్థినులతో సీఎం చంద్రబాబు
'ఆక్వా ధరలు తగ్గించవద్దు' - ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్‌తో చంద్రబాబు కీలక నిర్ణయం